తెలంగాణలో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు

హైద‌రా‌బాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా రానున్న 24గంటల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం పేర్కొంది. గురువారం తెల్లవారుజామునుంచే హైదరాబాద్ లో చిరుజల్లులు పడుతున్నాయి. ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరా‌లకు దగ్గ‌రలో వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో 4.5 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తోందని వాతా‌వ‌రణ అధి‌కారి రాజా‌రావు తెలిపారు. రాష్ట్ర‌వ్యా‌ప్తంగా ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న […] The post తెలంగాణలో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైద‌రా‌బాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా రానున్న 24గంటల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం పేర్కొంది. గురువారం తెల్లవారుజామునుంచే హైదరాబాద్ లో చిరుజల్లులు పడుతున్నాయి. ఉత్తర ఆంధ్రా, ఒడిశా తీరా‌లకు దగ్గ‌రలో వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో 4.5 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు వరకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తోందని వాతా‌వ‌రణ అధి‌కారి రాజా‌రావు తెలిపారు. రాష్ట్ర‌వ్యా‌ప్తంగా ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, మంచి‌ర్యాల, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, పెద్ద‌పల్లి, కరీం‌న‌గర్‌, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, వరం‌గల్‌ అర్బన్‌, వరం‌గల్‌ రూరల్‌, మహ‌బూ‌బా‌బాద్‌, భద్రాద్రి కొత్త‌గూడెం, ఖమ్మం, నల్ల‌గొండ, సూర్యా‌పేట జిల్లాల్లో గురు శుక్రవారాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు వాతావరణ కేంద్ర ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరించారు. అటు ఎపిలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

Two days of moderate rains in Telangana

 

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post తెలంగాణలో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: