ఖమ్మంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 4 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా మరో ఇద్దరికి కరోనా సోకిందన్నారు. కరోనా సోకిన ఇద్దరితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించామని, 27మందిని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్పించి నమూనాలు సేకరించినట్టు సూచించారు. పెద్దతండా, ఖిల్లా,మోతీనగర్ ను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించామన్న ఆయన కంటైన్మెంట్ జోన్లలో […] The post ఖమ్మంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 4 కరోనా పాజటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా మరో ఇద్దరికి కరోనా సోకిందన్నారు. కరోనా సోకిన ఇద్దరితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరించామని, 27మందిని ప్రభుత్వ ఆస్పత్రికి చేర్పించి నమూనాలు సేకరించినట్టు సూచించారు. పెద్దతండా, ఖిల్లా,మోతీనగర్ ను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించామన్న ఆయన కంటైన్మెంట్ జోన్లలో ప్రజలకు కావాల్సిన నిత్యవసరాలు, కూరగాయలు, ఇంటింటికీ అందిస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 247 మందికి నమూనాలు సేకరించగా 204 మంది ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఎవరైనా మాస్కులు లేకుండా బయటకొస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ ఇక్బాల్ మాట్లాడుతూ.. ఇవాల్టి నుంచి అనవసరంగా బయటకొచ్చే వారిని అరెస్ట చేస్తాం. పోలీసులు వచ్చినప్పుడు ఇళ్లలోకి వెళ్లి తర్వాత మళ్లీ రోడ్లపైకి వస్తున్నారు. లాక్ డౌన్ ను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కేసులు పెడతామని సిపి ఇక్బాల్ హెచ్చరించారు.

Two Coronavirus positive cases registered in Khammam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఖమ్మంలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: