కారులో ఇద్దరు చిన్నారులు మృతి…

childrens-diedనిజామాబాద్: జిల్లాలోని ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు రియాజ్(10), మహ్మద్(5)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి చిన్నారులు కనిపించకుండా పోయారు. దీంతో చిన్నారుల అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే, అర్థరాత్రి సమయంలో కారు వెనుక సీటులో విగత జీవులుగా పడివున్న ఇద్దరు చిన్నారులను పోలీసులు గుర్తించారు. పిల్లల మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీంతో ముజాహిద్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Two children died in Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కారులో ఇద్దరు చిన్నారులు మృతి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.