సెల్ ఫోన్ దొంగల అరెస్టు

నిందితుల్లో మైనర్ బాలుడు హైదరాబాద్: మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్, హోండా డియో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, కాప్రాకు చెందిన వేముల బాలరాజు అలియాస్ లడ్డు, మరో మైనర్ బాలుడితో కలిసి మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నాడు. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న బాలరాజు లేత్ మిషనర్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన […] The post సెల్ ఫోన్ దొంగల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
నిందితుల్లో మైనర్ బాలుడు

హైదరాబాద్: మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్, హోండా డియో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, కాప్రాకు చెందిన వేముల బాలరాజు అలియాస్ లడ్డు, మరో మైనర్ బాలుడితో కలిసి మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నాడు. తొమ్మిదో తరగతి వరకు చదువుకున్న బాలరాజు లేత్ మిషనర్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన బాలరాజు మరో నిందితుడితో కలిసి 2019లో ఇళ్లల్లో చోరీలు చేశాడు. ఈ క్రమంలో జూన్,2019 కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత మైనర్ బాలుడితో కలిసి సెల్ ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావు పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ ఎండి అబ్దుల్ జావీద్, ఎస్సైలు శ్రీధర్, ఎండి షానవాజ్ షఫీ, శ్రీనివాసులు పట్టుకున్నారు.

two cell phone robbers arrested at Rangareddy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సెల్ ఫోన్ దొంగల అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: