మారణాయుధాలను రవాణా చేస్తున్నఇద్దరి అరెస్టు

చాంద్రాయణగుట్ట : మారణాయుధాలను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఫలక్‌నుమా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు డాగర్లు, రెండు తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు విశ్వసనీయ సమాచారం అందింది. ఇద్దరు వ్యక్తులు మరణాయుధాలతో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్నారని తెలిసింది. ఏసీపీ ఎం.ఎ.రషీద్ మార్గదర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్సై కె.గోకరీ […] The post మారణాయుధాలను రవాణా చేస్తున్నఇద్దరి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చాంద్రాయణగుట్ట : మారణాయుధాలను రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఫలక్‌నుమా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు డాగర్లు, రెండు తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం… ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు విశ్వసనీయ సమాచారం అందింది. ఇద్దరు వ్యక్తులు మరణాయుధాలతో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్నారని తెలిసింది.

ఏసీపీ ఎం.ఎ.రషీద్ మార్గదర్శకత్వంలో ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్సై కె.గోకరీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. నవాబ్‌సాబ్‌కుంట, గుడికా దవఖానా ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదస్థితిలో కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని సోదా చేయగా వారి వద్ద మూడు డాగర్లు, రెండు తల్వార్లు లభించాయి. వారిని స్టేషన్‌కు తరలించి లోతుగా విచారించగా ఫలక్‌నుమా తీగలకుంటకు చెందిన ఏసీ మెకానిక్ అబ్దుల్ సొహెల్ ఖాన్ (18), అదేప్రాంతానికి చెందిన ఎంబ్రాయిడరీ పనిచేసే షేక్ బషీర్ (20)గా గుర్తించారు. ఈ మేరకు ఎస్సై గోకరీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Two arrested for transporting Arms

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మారణాయుధాలను రవాణా చేస్తున్నఇద్దరి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: