రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆదివాసీలు మృతి

Adivasis killed

 

17 మందికి తీవ్రగాయాలు

సత్తుపల్లి : ట్రాక్టర్, ఆటోలను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందగా మరో 17 మందికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సత్తుపల్లి జెవిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివాసీలు సత్తుపల్లి నియోజకవర్గ స్థాయిలో బహిరంగ సభ ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి మండలంలోని రామగోవిందాపురం గ్రామానికి చెందిన ఆదివాసీలు ట్రాక్టర్, ఆటోల్లో సత్తుపల్లికి బయలుదేరా రు. గంగారం సమీపంలోకి రాగానే అశ్వారావుపేట వైపు నుంచి సత్తుపల్లి వైపుకు వస్తున్న లారీ వెనుక నుండి ట్రాక్టర్, ఆటోలను ఢీకొట్టగా వాటిలో ప్రయాణిస్తున్న ఆదివాసుల్లో రామగోవిందాపురానికి చెందిన సరియం వెంకటేశ్వరరావు (30) అక్కడికక్కడే మృతి చెందాడు.

కోలా వెంకటధన య్య, కణితి లక్ష్మణరావు, వాసం కాంతమ్మ, సిద్దిని గంగులకు తీవ్ర గాయాలు కాగా వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే వీరిలో కణితి లక్ష్మణరావు (30) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన మరో 13 మందికి స్వల్ప గాయాలు కావడంతో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం అందిస్తున్నారు. వెంకటేశ్వరరావు, లక్ష్మణరావు మృతదేహాలను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న సిఐ సురేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు.

పరామర్శించిన ఎంపి, ఎమ్మెల్యే..
రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి ఆసుపత్రికి తరలించే చర్యల్లో పాలు పంచుకొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యేతోపాటు ఖమ్మం ఎంపి నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును నామాకు సండ్ర వివరించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులకు సూచించారు.

Two Adivasis killed in Road Accident

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆదివాసీలు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.