నన్నెవరూ అరెస్ట్ చేయలేదు: టివి9 రవిప్రకాశ్

  హైదరాబాద్: అలంద మీడియా డైరెక్టర్ పి.కౌషిక్ రావు ఫిర్యాదు మేరకు టివి9 సిఈవొ రవిప్రకాశ్, నటుడు శివాజిలపై సైబర్ క్రైం పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. వీరిపై 406, 420,467,469,471,120(బి) ఐపిసి సెక్షన్లతో పాటు ఐటి చట్టం 66, 72ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సిఆర్‌పిసి 160 కింద శుక్రవారం ఉదయం సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరుకావాలని రవిప్రకాశ్, నటుడు శివాజి ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. అయితే, […] The post నన్నెవరూ అరెస్ట్ చేయలేదు: టివి9 రవిప్రకాశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: అలంద మీడియా డైరెక్టర్ పి.కౌషిక్ రావు ఫిర్యాదు మేరకు టివి9 సిఈవొ రవిప్రకాశ్, నటుడు శివాజిలపై సైబర్ క్రైం పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. వీరిపై 406, 420,467,469,471,120(బి) ఐపిసి సెక్షన్లతో పాటు ఐటి చట్టం 66, 72ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సిఆర్‌పిసి 160 కింద శుక్రవారం ఉదయం సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరుకావాలని రవిప్రకాశ్, నటుడు శివాజి ఇళ్లకు పోలీసులు నోటీసులు అంటించారు. అయితే, తనపై పోలీసు కేసు నమోదైనట్లు, తన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ గురువారం సాయంత్ర టివి9లో రవిప్రకాశ్ లైవ్‌లోకి వచ్చారు. తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, తాను ఎక్కడికీ పారిపోలేదని వివరణ ఇచ్చారు. తాను ఇప్పటికీ టివి9 సిఇఒగా కొనసాగుతున్నానని వివరించారు. తనను ఎవరూ అరెస్టు చేయలేదని, చేయబోరని తెలిపారు. నిజం చెప్పులు వేసుకునే లోపు అబద్దం ప్రపంచం తిరిగి వస్తుందని తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రవిప్రకాశ్ భార్యకు నోటీసులు  
మరోవైపు సైబర్ క్రైం పోలీసులు టివి9 సిఇఒ రవిప్రకాశ్‌క భార్యకు నోటీసులు అందించారు. పోలీసులు రవి ప్రకాశ్ ఇంటికి వెళ్లిన సమయంలో అతను లేకపోవడంత ఆయన భార్యకు నోటీసులిచ్చారు. సిఆర్‌పిసి 160 కింద నోటీసులిచ్చారు. ఆ నోటీసుల్లో రవిప్రకాశ్ శుక్రవారం ఉదయం సైబర్ క్రైం పోలీసుల ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు.

 TV9 CEO Ravi Prakash respond on forgery case 

The post నన్నెవరూ అరెస్ట్ చేయలేదు: టివి9 రవిప్రకాశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: