అద్భుత ఔషధగుణాలెన్నో

turmericపసుపు లేనిదే వంట పూర్తికాదేమో! పసుపులో ఉన్నన్ని ఔషధగుణాలు మరెందులో కనిపించవు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత శక్తి ఇందులో ఉంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా గలదీ పసుపు పొడి. అన్ని రకాల రోగాల అనువైన మందు. సౌందర్యసాధనాల్లోనూ ముందుంటుంది.

* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మ
వ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బా గా మరుగుతుండగా ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి చర్మంపై రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది. పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం తాజాగా ఉంటుంది.
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. ఇలా చేస్తే పింపుల్స్ తగ్గుతాయి. రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాం బ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
* చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగ లో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు, కీళ్లనొప్పులు తగ్గుతాయి.
* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ లాగా పట్టిస్తుంటే మొటిమలు, మచ్చలు నివారించవచ్చు. చర్మం
గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
* పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.

Turmeric Health Benefits

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అద్భుత ఔషధగుణాలెన్నో appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.