విలీనం కోరం

Ashwaththama-Reddy

 ప్రభుత్వంలో ఆర్‌టిసిని కలపాలన్న డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెడుతున్నాం
చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
కార్మిక సంఘాల జెఎసి చైర్మన్ అశ్వత్థామరెడ్డి

మన తెలంగాణ/హైదారాబాద్: ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న నిర్ణయానికి ఆర్‌టిసి జెఎసి తాత్కాలికంగా స్వస్తి పలికింది. ఈక్రమంలో ఆ ర్‌టిసి జెఎసి తమ డిమాండ్లలో ఒక మె ట్టు దిగింది. విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టామని, ప్రభుత్వం చర్చలు జరపాలని కోరుతున్నామని ఆర్‌టిసి జెఎసి చైర్మన్ అశ్వత్థామరెడ్డి చెప్పా రు. సమ్మె చేస్తున్న కార్మిక నేతలను పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తున్నారని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో అ న్ని వర్గాలు సమ్మెకు మద్దతివ్వాలని అ శ్వత్థామరెడ్డి విజ్ఞప్తి చేశారు.

విలీనం డి మాండ్ మినహాయించి మిగతా 25 డి మాండ్ల మీద చర్చ జరపాలని డిమాండ్ ఆయన చేశారు. సమ్మెలో భాగంగా శుక్రవారం అన్ని గ్రామాల్లో బైక్‌ర్యాలీలు నిర్వహిస్తామని, ఈ నెల 16న ఇందిరాపార్క్ వద్ద జెఎసి నేతలు దీక్ష చేస్తారని తెలిపారు. 17, 18 తేదీల్లో అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు చేపడతామని, అలాగే ఈనెల 19న హైదరాబాద నుంచి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహించనున్నామని తెలిపారు. సమ్మెకాలంలో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్‌ను కలుస్తామని, అలాగే ఎన్‌హెచ్‌ఆర్‌సి అపాయింట్‌మెంట్ కూడా కోరామని జెఎసి నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఇదిలావుండగా ఆర్‌టిసి కార్మికుల సమ్మె 41వ రోజుకు చేరింది.

గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు డిపోల వద్ద ఆందోళనలు, నిరసనలు, నిరాహార దీక్షలు నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని ఆర్‌టిసి కార్మికులు నినదిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదేవిధంగా ఐటిడిఎ సమీక్షలో మంత్రి పాల్గొన్న సమయంలో ఆర్‌టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ తీర్మానం చేయాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. అందుకు మంత్రి సత్యవతి తిరస్కరించడంతో వీరయ్య వాకౌట్ చేశారు.

విలీనం డిమాండ్‌కు స్వస్తికి నిర్ణయం

తెలంగాణ ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో గురువారం జెఎసి నేతలు, కార్మిక సంఘాలతో సమావేశమైంది. ఈ భేటీలో పాల్గొన్న అశ్వత్థమారెడ్డి, రాజిరెడ్డి, కోదండరాం, పల్లా వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, వి. హనుమంతరావు, చెరుకు సుధాకర్ తదితరులు ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌కు స్వస్తి పలకాలని నిర్ణ యం తీసుకున్నారు. అలాగే ఈ సమావేశంలో ప్రధానంగా వరుసగా జరుగుతున్న కార్మికుల ఆత్మహత్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుగుతున్నట్లు తెలియవచ్చింది. అలాగే సడక్ బంద్ కార్యక్రమం, కోర్టులో వాదనలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో సమ్మెపై ఆర్‌టిసి జెఎసి కీలక మాట్లాడుతూ ఆర్‌టిసిని ప్రభుత్వం విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా స్వస్తి పలుకుతున్నామని ప్రకటించారు. మిగిలిన అంశాలపై తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులను ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయిస్తుందని మండిపడ్డారు

. సేవ్ ఆర్‌టిసి పేరుతో రేపటి నుంచి డిపోల ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.కార్మికులు ఆత్మస్తైర్యాన్ని కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్‌టిసి కార్మికులకు అన్ని సంఘాలు, ప్రజల మద్దతు ఉందన్నారు. కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత అని స్పష్టం చేశారు. కార్మికులను తప్పుదోవ పట్టించేలా కొంతమంది పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, విలీన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఆర్‌టిసి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు,కనీసం పరామర్శించిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈక్రమం లో 23 మంది ఆర్‌టిసి కార్మికుల మరణాలకు ప్రభుత్వమే కారణమన్నారు.

ఆర్‌టిసిని ప్రైవేటు పరం చేస్తే బడుగు బలహీన వర్గాలు ఉపాధి అవకా శాన్ని కోల్పోవలసి వస్తుందని వివరించారు. ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల్లో అది రుజువవుతోందని, ఈనెల 16న జెఎసి కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి కో కన్వీనర్ రాజిరెడ్డి, లింగమూర్తి, సుధా. సామూహిక దీక్షలో కూర్చుంటారని జెఎసి నేతలు తెలిపారు. ఆర్‌టిసి కార్మికుల డిమాండ్ల సాధన కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో ప్ర జలు విద్యార్థులు కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటి ంచాలని జెఎసి నేతలు కోరారు. ఈ క్రమంలో ఆర్‌టిసి కార్మికుల పో రాటానికి సహకరించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశామని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని, అలాగే జెఎసి కార్యక్రమాలన్నింటినీ మద్దతు పలికారని తెలిపారు.

tsrtc strike

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విలీనం కోరం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.