శ్రీశైలంకు టిఎస్‌ఆర్‌టిసి స్పెషల్ బస్సులు

TSRTC

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా శుక్రవారం జరుపుకునే మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా టిఎస్‌ఆర్‌టిసి హైదరాబాద్ నుండి శ్రీశైలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజిబిఎస్, లింగంపల్లి బస్టాండు ప్రాంతాలతో పాటు ప్రయాణికుల రద్దీ మేరకు ఇతర ప్రాంతాల నుండి బస్సులు నడుపుతారని తెలిపా రు. అలాగే బస్సు ఛార్జీలను కూడా నిర్ణయించారు. లింగంపల్లి నుండి శ్రీశైలం వరకు రూ.530, ఎంజిబిఎస్ నుండి శ్రీశైలం వరకు రూ.500లు ఖరారు చేశారు. పూర్తి వివరాలకు మియాపూర్ డిపో మేనేజర్ సెల్ నెంబర్ 9959226153. మెహిదిపట్నం డిపో మేనేజర్ సెల్ నెంబర్ 9959226133లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అటు మహాశివ రాత్రి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్ గౌడ్ అదేశాల మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌వేములవాడ ప్రత్యేక బస్సు సర్వీసుల టూర్ ప్యాకేజి విడుదల చేశారు. ఈ మేరకు బధవారం విడుదల చేసిన ప్రకటనలో గురువారం నుండి మూడు రోజుల పాటు హైదరాబాద్ నుండి వేముల వాడకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీసులు బషీర్ బాగ్ సిఆర్‌ఓ కార్యాలయం నుండి ఉదయం 7 గంటలకు నాన్ ఎసీ హైటెక్ కోచ్ బస్సు సర్వీసులు హైదరాబాద్ నగరం నుండి బయలుదేరి మధ్యామ్నం 1 గంటలకు వేముల వాడ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు ఆలయం దర్శనం ,అనంతరం మిడ్ మానేరు డ్యాం సందర్శన, ఇక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి రాత్రి 7:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. ఈ సర్వీసులల్లో పెద్దలకు రూ.550, పిల్లలకు రూ.440 టికెట్ ధర ఖరారు చేశారు. బుకింగ్, రిజర్వేషన్‌ల ఇతర సమాచారం కోసం సెల్ నెంబర్ 9848540371, 9848126947లను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

TSRTC Special Buses to Srisailam

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post శ్రీశైలంకు టిఎస్‌ఆర్‌టిసి స్పెషల్ బస్సులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.