ఆర్ టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్టు

TS RTC JACహైదరాబాద్ : తెలంగాణలో ఆర్ టిసి సమ్మె ఉధృతమైంది. ఈ క్రమంలో తెలంగాణలో ఆర్‌టిసి కార్మికులు 14వరోజు సమ్మె చేస్తున్నారు. సుందరయ్య విజ్ఞాన భవన్ సమీపంలోని పార్కు వద్ద ఆందోళన చేస్తున్న తెలంగాణ ఆర్ టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు జెఎసి కో-కన్వీనర్ రాజీరెడ్డి, నేత వెంకన్నలను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమను అరెస్టు చేయడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తమతో చర్చలు జరిపి, తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

TSRTC JAC Convener Ashwatthama Reddy Arrest

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్ టిసి జెఎసి కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్టు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.