రేపు విఆర్‌ఒ పరీక్ష

ఉదయం 11 గంటల నుంచి మ.1.30 గంటల వరకు 2,945 కేంద్రాలు….. 10.58 లక్షల మంది అభ్యర్థులు మనతెలంగాణ/హైదరాబాద్ : విలేజ్ రెవిన్యూ ఆఫీసర్(విఆర్‌ఒ) పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,945 కేంద్రాలలో జరుగనున్న విఆర్‌ఒ పరీక్షకు 10,58,868 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. అభ్యర్థుల్లో ఎవరికైనా తమ […]

ఉదయం 11 గంటల నుంచి మ.1.30 గంటల వరకు
2,945 కేంద్రాలు….. 10.58 లక్షల మంది అభ్యర్థులు

మనతెలంగాణ/హైదరాబాద్ : విలేజ్ రెవిన్యూ ఆఫీసర్(విఆర్‌ఒ) పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్దం చేసింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 2,945 కేంద్రాలలో జరుగనున్న విఆర్‌ఒ పరీక్షకు 10,58,868 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 9.30 గంటలకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతిస్తారు. అభ్యర్థుల్లో ఎవరికైనా తమ హాల్‌టికెట్లలో పేరు తప్పుగా ప్రచురితమైనా, ఫొటో లేకపోయినా ఎవరూ ఆందోళన చెందవద్దు. రెండు ఫొటోలతో ఛీఫ్ సూపరింటెండెంట్‌కు లేఖ రాయాలని చెప్పారు. ఆ లేఖను పరిశీలించి ఛీఫ్ సూపరింటెండెంట్ పరీక్షకు అనుమతిస్తారని స్పష్టం చేశారు.

వెబ్‌సైట్‌లో డిజిపిల్ ఒఎంఆర్ పత్రాలు : టిఎస్‌పిఎస్‌సి ఇదివరకు నిర్వహించిన పరీక్షలకు ఇచ్చే విధంగా ఈ సారి విఆర్‌ఒ పరీక్ష రాసే అభ్యర్థులకు కార్బన్‌లెస్ కాపీ ఇవ్వరు. అభ్యర్థుల ఒఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసిన తర్వాత డిజిటల్ కాపీలను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. టిఎస్‌పిఎస్‌సి నిర్వహించిన పరీక్షలకు పరీక్ష జరిగిన 48 గంటల్లోగా డిజిటల్ కాపీలను అందుబాటులో ఉంచగా, పరీక్షకు అభ్యర్థులు ఎక్కువగా ఉన్నందున కొంత ఆలస్యం కావచ్చని అధికారులు తెలిపారు.

TSPSC: VRO Exam

Comments

comments

Related Stories: