గ్రూప్‌-4 ఎగ్జామ్ జవాబు పత్రాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్షకు హాజరైన అభ్యర్థుల డిజిటల్ జవాబు పత్రాలను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. పరీక్ష రాసినవారు తమ ఒఎంఆర్ జవాబు పత్రాలను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొందరు అభ్యర్థులు ఎగ్జామ్ సమయంలో చేసిన కొన్ని తప్పుల వల్ల వారి ఒఎంఆర్ షిట్స్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. అలా అర్హత పొందనివారి ఒఎంఆర్‌ వివరాలతో పాటు హాల్‌టికెట్ నంబర్లు వెబ్‌సైట్లో ఉంచనున్నారు. ఇక అక్టోబరు 7న మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టిసిలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్‌ […]

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్‌-4 పరీక్షకు హాజరైన అభ్యర్థుల డిజిటల్ జవాబు పత్రాలను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. పరీక్ష రాసినవారు తమ ఒఎంఆర్ జవాబు పత్రాలను టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొందరు అభ్యర్థులు ఎగ్జామ్ సమయంలో చేసిన కొన్ని తప్పుల వల్ల వారి ఒఎంఆర్ షిట్స్ ను రిజెక్ట్ చేయడం జరిగింది. అలా అర్హత పొందనివారి ఒఎంఆర్‌ వివరాలతో పాటు హాల్‌టికెట్ నంబర్లు వెబ్‌సైట్లో ఉంచనున్నారు. ఇక అక్టోబరు 7న మొత్తం 1,595 గ్రూప్-4 పోస్టులతోపాటు ఆర్టిసిలో 72 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి)లో 124 బిల్‌ కలెక్టర్‌ పోస్టులు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లో 76 పోస్టుల భర్తీకి రాతపరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఓఎంఆర్ షీట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం పరీక్ష ప్రాథమిక కీని కూడా విడుదల చేయనున్నారు.

Related Stories: