పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాలు వెల్లడించొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ ఆదేశాలు వెలువడే వరకూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నిర్వహించే పరీక్షల ఫలితాలను వెల్లడించరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి ఓసీలకు 44, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 49 సంవత్సరాలుగా చేస్తూ 2017లో జీవో 199 వెలువడిందని, అయితే సదరు పోస్టుల భర్తీలో ఓసీల వయస్సు 39గా నిర్ణయించడం చెల్లదని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు విచారించారు. జీవో 199 ప్రకారం వయోపరిమితి పెంపును అమలు […]

మన తెలంగాణ/హైదరాబాద్ : తమ ఆదేశాలు వెలువడే వరకూ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నిర్వహించే పరీక్షల ఫలితాలను వెల్లడించరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితి ఓసీలకు 44, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు 49 సంవత్సరాలుగా చేస్తూ 2017లో జీవో 199 వెలువడిందని, అయితే సదరు పోస్టుల భర్తీలో ఓసీల వయస్సు 39గా నిర్ణయించడం చెల్లదని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు విచారించారు. జీవో 199 ప్రకారం వయోపరిమితి పెంపును అమలు చేసే అంశాన్ని పరిశీలన చేయాలని, కోర్టును ఆశ్రయించిన వారి దరఖాస్తులను మాత్రం స్వీకరించి పరీక్షకు అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.

Comments

comments

Related Stories: