కానిస్టేబుల్ అభ్యర్థులకు రేపటి నుంచి హాల్‌టికెట్లు

www.tslprb.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 30న ప్రిలిమినరీ రాత పరీక్ష మన తెలంగాణ/ హైదరాబాద్: ఈ నెల 30న జరుగను న్న కానిస్టేబుల్ అర్హత రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు గురువారం నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి.వి.శ్రీనివాస్‌రావు మంగళవా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 16,925 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 30న టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ […]

www.tslprb.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
30న ప్రిలిమినరీ రాత పరీక్ష

మన తెలంగాణ/ హైదరాబాద్: ఈ నెల 30న జరుగను న్న కానిస్టేబుల్ అర్హత రాత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు గురువారం నుంచి హాల్‌టికెట్లు జారీ చేస్తున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎస్‌ఎల్‌పిఆర్‌బి) చైర్మన్ వి.వి.శ్రీనివాస్‌రావు మంగళవా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 16,925 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 30న టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం 4,79,166 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఈ నెల 30న ప్రిమిలినరీ రాత పరీక్ష నిర్వహించేందుకు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్ ద్వారా 20వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించామన్నారు. హాల్‌టికెట్లు టౌన్‌లోడ్ కానీ అభ్యర్థులు, ఇతర సమాచారం కోసం ఈ–మెయిల్ support ట@tslprb.in మరియు 9391005006, 3931005006 సెల్‌నెంబర్లపై సంప్రదించాలని శ్రీనివాస్‌రావు అభ్యర్థులకు సూచించారు.హాల్‌టికెట్ ప్రింట్‌ఔట్ ఎ4 సైజ్ పేపర్‌లో తీసుకోవాలని కూడా సూచించారు.

TSLPRB:Constable Hall Ticket DownLoad

Telangana news

Comments

comments

Related Stories: