పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు..

హైదరాబాద్‌ః తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. డిజిపి ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలంటూ అధికారులు వీకే సింగ్‌కు ఆదేశించారు. వీకే సింగ్ స్థానంలో తెలంగాణ పోలీస్ అకాడమీ ఇన్‌చార్జ్‌గా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం శ్రీనివాసరావు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. కాగా, వీకే సింగ్ గతకొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 24న స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ కేంద్రానికి వీకే సింగ్ లేఖ రాశారు. ఈ లేఖలో వీకే సింగ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది.

TS Police Academy Director V K Singh Transferred

The post పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.