18న పిఇసెట్ నోటిఫికేషన్

హైదరాబాద్:వ్యాయామ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ నోటిఫికేషన్ ఈ నెల 18న జారీ కానుంది. ఈ మేరకు గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పిఇసెట్ కమిటీ సమావేశంలో పిఇసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పిఇసెట్‌కు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 15 నుంచి బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. పిఇసెట్ దరఖాస్తు ఫీజు రూ.800(ఎస్‌సి,ఎస్‌టిలకు రూ.400)గా నిర్ణయించారు. […]

హైదరాబాద్:వ్యాయామ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే పిఇసెట్ నోటిఫికేషన్ ఈ నెల 18న జారీ కానుంది. ఈ మేరకు గురువారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పిఇసెట్ కమిటీ సమావేశంలో పిఇసెట్ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పిఇసెట్‌కు ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

మే 15 నుంచి బిపిఇడి, డిపిఇడి కోర్సుల్లో ప్రవేశాలకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. పిఇసెట్ దరఖాస్తు ఫీజు రూ.800(ఎస్‌సి,ఎస్‌టిలకు రూ.400)గా నిర్ణయించారు. ఈ సమావేశంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, పిఇసెట్ కన్వీనర్ వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

TS PECET 2019 Notification on Feb 18th

Related Stories: