మైనారిటీ గురుకులాలో ప్రవేశాల షెడ్యూల్డ్ విడుదల

5వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రవేశాలకు అర్హత పరీక్ష
మార్చి20వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
రాష్ట్ర మైనారిటీ విద్యాసోసైటీ అధ్యక్షులు ఎ.కె.ఖాన్ వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ గురుకులాల్లో 2020-2021 విద్యా సంవత్సరానికి ప్రవేశాల షెడ్యూల్డ్‌ను రాష్ట్ర మైనారిటీ విద్యా సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎకె.ఖాన్ శనివారం ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2020-2021 ఏడాది 5వ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు ప్రవేశాలను అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆడ్మిషన్ కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు అర్హులైన విద్యార్థులు ఆయా తరగతుల్లో ప్రవేశాలకు ఆర్హత పరీక్షకు హజరయ్యేందుకు గాను ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను 20 మార్చి వరకు సమర్పించేందుకు గడువు ఖరారు చేశామన్నారు. ఆ యా తరగతుల వారీగా నిర్వహించే ప్రవేశాల పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులను ఆయా తరగతుల్లో ఆడ్మిషన్‌లు ఇస్తామన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు 12 ఏప్రిల్ అర్హత పరీక్ష నిర్వహిస్తుండగా, 5వ తరగతిలో అడ్మిషన్ పొందు విద్యార్థులు ఏప్రిల్18న జరిగే అర్హత పరీక్షకు హజరు కావాలని తెలిపారు. ఇదిలా ఉండగా 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు ప్రవేశాలకు గాను ఏప్రిల్ 20న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా అర్హత పరీక్షల ఫలితాలను 2మే విడుదల చేస్తారని పేర్కొన్నారు. ఆయా తరగతుల్లో ప్రవేశాల నిమిత్తం ధృవీకరణ పత్రాల పరిశీలన 5మే నుండి15 మే వరకు పూర్తి చేసి, 12 జూన్ నుండి బడులు,కళాశాలు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. అర్హత పరీక్ష దరఖాస్తుల నమోదు, ఇతర పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.tmreis.telangana.gov.inను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు మైనారిటీ విద్యా సోసైటీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నెంబర్ 04023437909ను ఏర్పాటు చేశామన్నారు. ఆయా జిల్లాలోని మైనారిటీ సంక్షేమ జిల్లా కార్యాలయాల్లో ప్రవేశాల షెడ్యూల్డ్ సమాచారం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యా సోసైటీ కార్యదర్శి బి.షపీవుల్లా మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలతో పాటు క్రిస్టియన్, పార్సీ సిక్కు, జైన్, బౌద్ద మతాలకు చెందిన విద్యార్థులతో పాటు ఎస్‌సి, ఎస్‌టి,బిసి, ఓసి విద్యార్థులను కూడా అర్హతల మేరకు ఆయా తరగతుల్లో ప్రవేశాలను కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకులాలల్లో ఐదవ తరగతి ప్రవేశాలకు 14,640 సీట్లు అందుబాటులో ఉండగా, ఇంటర్ మొదటి సంవత్సరానికి 83 జూనియర్ కాలేజీల నందు 6,640 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.
సంక్షిప్తంగా షెడ్యూల్డ్ వివరాలు:
20మార్చి వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు గడువు
ఇంటర్ మొదటి సంవత్సరం అర్హత పరీక్ష ఏప్రిల్ 12
5వ తరగతి ఆడ్మిషన్‌లకు అర్హత పరీక్ష ఏప్రిల్ 18
6నుండి8వ తరగతి వరకు అడ్మిషన్‌లకు అర్హత పరీక్ష ఏప్రిల్ 20
అర్హత పరీక్ష ఫలితాలు మే 2
ధృవీకరణ పత్రాల పరిశీలన మే 5 నుండి మే 15వరకు

TS Minority Gurukulam Admissions 2020 Schedule Release

The post మైనారిటీ గురుకులాలో ప్రవేశాల షెడ్యూల్డ్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.