అందరికీ ఆరోగ్య పరీక్షలు

  ఈ నెల 26 నుంచి సెప్టెంబరు 30 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు  కోటి కుటుంబాలకు లబ్ధి  టిబి, కుష్టు సహా 13 రకాల వ్యాధుల నివారణకు కృషి  ఆశ, ఎఎన్‌ఎం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహణ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య పరీక్షలు (యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం) నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయించింది. ఈ మేర కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణ బుధవారం అన్ని జిల్లాల కు ఉత్తర్వులు […] The post అందరికీ ఆరోగ్య పరీక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఈ నెల 26 నుంచి సెప్టెంబరు 30 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు

 కోటి కుటుంబాలకు లబ్ధి
 టిబి, కుష్టు సహా 13 రకాల వ్యాధుల నివారణకు కృషి
 ఆశ, ఎఎన్‌ఎం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహణ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అందరికీ ఆరోగ్య పరీక్షలు (యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం) నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయించింది. ఈ మేర కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ యోగితారాణ బుధవారం అన్ని జిల్లాల కు ఉత్తర్వులు జారీచేశారు. కుష్టు, టిబి, పాలియేటివ్ కేర్, మానసిక వైద్యం, అసంక్రమిత వ్యాధులు సహా మొత్తం 13 రకాల వ్యాధులను గుర్తించి వాటిని నయం చేయాలన్నదే దీని ఉద్దేశమని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు గ్రామాల్లో వైద్య సిబ్బంది ప్రతీ ఇంటికీ వెళ్లి స్క్రీనింగ్ ప్రక్రియ చేపడతారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం ఆమె విడుదల చేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది బృం దాలుగా ఏర్పడతారు. డ్వాక్రా, స్వయం సహాయక గ్రూపులు, అంగన్‌వాడీ సభ్యుల సహకారం కూడా తీసుకుంటారు. గ్రా మ పంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రతిరోజు క్షేత్రస్థాయిలో స్క్రీనింగ్ చేసి ప్రతిరోజు సం బంధిత రిపోర్ట్‌ను జిల్లా కార్యాలయానికి పంపించాలి. అలాగే అదే రిపోర్టును ప్రతిరోజు విలేజ్ హెల్త్ సర్వీస్ యాప్‌లో నమో దు చేయాలని ఆ మె కోరారు. ఆశ కార్యకర్తలు, ఎఎన్‌ఎం లు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామస్థాయి సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ప్రతీ రోజూ గ్రామంలో ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రజలను స్క్రీనింగ్ చేస్తారు. ప్రతిరోజు 20 ఇళ్ల చొప్పున వెళ్లి స్క్రీనింగ్ చేయాలి. ఇద్దరు చొప్పున ఒక టీమ్‌గా ఏర్పడి పని చేయాలని ఆమె కోరారు. దాదాపు కోటి కుటుంబాలను ఈ సందర్భంగా కలిసే అవకాశముంది. యూనివర్సల్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాం అని పేర్కొంటున్నా ఈ కార్యక్రమంలో సమగ్ర ఆరోగ్య సర్వే చేపడుతున్నట్లు కనిపించడంలేదని వైద్యాదికారులు అంటున్నారు.
మార్గదర్శకాలు..
* హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతీ ఇంటికి సంబంధించి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలి. ఇది మున్ముందు గ్రామాల వారీగా ఆరోగ్య రికార్డును తయారు చేయడానికి వీలవుతుంది.
* ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలో జరిగే పరీక్షలకు అక్కడి మెడికల్ ఆఫీసర్ నేతృత్వం వహిస్తారు. సబ్ సెంటర్‌కు ఏఎన్‌ఎం పర్యవేక్షణగా ఉంటారు.

* ఉదయం 6.30 నుంచి 9.30 వరకు స్క్రీనింగ్ ప్రక్రియ ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో ఎవరైనా లేకుంటే సాయంత్రం వెళ్లి చేయాల్సి ఉంటుంది.
* -కుటుంబ సభ్యులకు ఉన్న వ్యాధులు, అనుమానిత రోగాలను గుర్తించి నమోదు చేయాలి. వాటిని అదే రోజు జిల్లా వైద్యాధికారికి పంపాలి.
* టీబీ కేసులు ఏవైనా ఉంటే నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలి.
* ఏదైనా వ్యాధి ఉన్నట్లు అనుమానిస్తే ప్రొటోకాల్ ప్రకారం సంబంధిత పరీక్షలను వారం రోజుల్లో చేయించాలి.
* ఏదైనా వ్యాధి ఉన్నట్లు నిర్దారణ జరిగితే ప్రొటోకాల్ ప్రకారం వైద్యం చేయాలి. వైద్యం చేయించే తేదీని కూడా నమోదు చేయాలి.
* రోజువారీ స్క్రీనింగ్ వివరాలను గ్రామ ఆరోగ్య రికార్డులో ఏఎన్‌ఎంలు నమోదు చేయాలి.
* రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే అందరికీ ఆరోగ్య స్క్రీనింగ్ కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమం ఈ నెల 17న ఉంటుంది. జిల్లాల్లో 20 నుంచి 22వ తేదీ వరకు వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు.
* కార్యక్రమానికి సంబంధించి వివరాలను ఈ నెల 24, 25 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రకటిస్తారు.

 TS Medical Health Department to decide tests all of State

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అందరికీ ఆరోగ్య పరీక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: