జూ. పంచాయతీ కార్యదర్శి పరీక్ష వాయిదా

హైదరాబాద్: జూ. పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్ 10కి వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు గడువు గత శనివారం ముగిసింది. ఈ పోస్టులకు చివరిరోజైన శనివారం సాయంత్రంవరకు 5,69,447 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ వారం క్రితం ఉత్తర్వులు […]

హైదరాబాద్: జూ. పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష అక్టోబర్ 10కి వాయిదా పడింది. రాష్ట్రవ్యాప్తంగా 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో భాగంగా దరఖాస్తు గడువు గత శనివారం ముగిసింది. ఈ పోస్టులకు చివరిరోజైన శనివారం సాయంత్రంవరకు 5,69,447 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం రాత పరీక్షను అక్టోబర్ 4న నిర్వహించనున్నట్లు నియామక ప్రక్రియ కమిటీ కన్వీనర్ నీతూ ప్రసాద్ వారం క్రితం ఉత్తర్వులు కూడా జారీ చేయగా, తాజాగా పరీక్షను అక్టోబర్ 10కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Comments

comments

Related Stories: