ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

board of intermediateహైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగనున్నాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఈ పరీక్షలకు ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. 2 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు. ఇంటర్‌బోర్డు నిర్దేశించిన సమయంలోనే ప్రాక్టికల్స్ జరుగుతాయి. ప్రాక్టికల్ ప్రశ్నపత్రాన్ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకొవడానికి ఇంటర్‌బోర్డు అవకాశం కల్పించింది. పరీక్షలు నిర్వహించిన రోజే మార్కులను వైబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత అప్‌లోడ్ చేసేందుకు వెబ్‌సైట్ సహకరించదని అధికారులు సూచించారు. పారదర్శకంగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని కళాశాలల యాజమాన్యాలకు ఇంటర్‌బోర్డు ఆదేశించారు. ట్యూషన్ ఫీజులు చెల్లించకపోవడం వంటి కారణాలతో విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఇంటర్‌బోర్డు హెచ్చరించింది. ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

TS Inter practical exams from February 1

Related Images:

[See image gallery at manatelangana.news]