రెండో శనివారం కూడా పనిచేయాలి: ఇంటర్ బోర్డు

Telangana Board of Intermediate Education

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలు, ఇంటర్మీడియేట్ కోర్సు ఆఫర్ చేస్తున్న కంపోజిట్ డిగ్రీ కళాశాలలు రెండవ శనివారం కూడా పనిచేయాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఈ మేరకు 2020 మార్చి వరకు కళాశాలలు రెండవ శనివారం పనిచేయాలని కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్‌టిసి సమ్మె కారణంగా దసరా సెలవులు పొడిగించిన నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు సకాలంలో సిలబస్ పూర్తి చేసేందుకు రెండవ శనివారం కూడా కళాశాలలు నిర్వహించాలని ఆదేశించారు.

TS Inter board Order to Jr Colleges work in 2nd Saturday

The post రెండో శనివారం కూడా పనిచేయాలి: ఇంటర్ బోర్డు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.