తన ఫొటోలను పోర్న్ సైట్స్‌ నుంచి తొలగించండి…

 

హైదరాబాద్: ఫేస్‌బుక్‌లో తన పేరు, ఫొటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి, పోర్న్‌సైట్లలో పెడుతున్నారని ఓ యువతి  హైకోర్టు మెట్లెక్కింది. పోర్న్‌వెబ్‌సైట్ల నుంచి తన పేరు, ఫొటోలను తొలగించాలని గతంలో గూగుల్‌కి ఫిర్యాదు చేసినప్పటికీ.. ఆ సంస్థ పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించానని బాధితురాలు పేర్కొంది. దీనిపై విచారించిన హైకోర్టు గూగుల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పోర్న్ సైట్స్‌ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, అలాంటి వెబ్‌సైట్లపై గూగుల్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అశ్లీల వెబ్‌సైట్లపై పూర్తి వివరాలు అందజేయాల్సిందిగా గూగుల్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.

TS High Court issues notice to google on porn sites

The post తన ఫొటోలను పోర్న్ సైట్స్‌ నుంచి తొలగించండి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.