సచివాలయ కూల్చివేత నిలిపివేయండి

TS High Court demolition of old secretariat

 

హైదరాబాద్: సచివాలయం కూల్చివేత పనులకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. సోమవారం వరకు పనులు నిలిపివేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నగరానికి చెందిన సామాజికవేత్త పిఎల్ విశ్వేశ్వర రావు వేసిన పిల్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజా ఆదేశాలిచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని తెలిపింది. ఇప్పటికే 60శాతం కూల్చివేసినట్టు సమాచారం.

అయితే తమకు ఇంకా ఎలాంటి ఆదేశాలు అందలేదని, అప్పటి వరకు యథాతథంగా పనులు జరుగుతాయని సచివాలయ అధికారులు చెబుతున్నారు. ఆదేశాలు అందాక తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. వారం రోజుల క్రితమే కూల్చివేతలకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన విషయం తెలిసిందే. గత మంగళవారం కూల్చివేత పనులు ప్రారంభించారు. నాలుగు రోజులుగా నిర్విరామంగా జరుగుతున్న పనులకు హైకోర్టు తాజా ఆదేశాలతో తాత్కాలికంగా బ్రేక్ పడినట్టైంది.

తీన్మార్ మల్లన్నకు హైకోర్టు మందలింపు
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆరోగ్య వివరాలను ఆరా తీయాలని వేసిన ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశ్యంతో ఉందని హైకోర్టు పిటిషన్ దారు తీన్మార్ మల్లన్న(నవీన్)పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలపాలంటూ రాష్ట్ర హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ నవీన్ కోరారు. సిఎం కెసిఆర్ ఆరోగ్యం ఎలా ఉందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌ను లంచ్ మోషన్‌గా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ పిటిషన్ విచారించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పొలిటికల్ జిమ్మిక్కులు చేస్తే ఉరుకోలేమని మొట్టికాయలు వేసింది. ముఖ్యమంత్రి కనిపించక పోతే హెబియస్ కార్పస్ ధాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

Telangana High Court halts demolition of old secretariat

Related Images:

[See image gallery at mtlive.mediology.in]

The post సచివాలయ కూల్చివేత నిలిపివేయండి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.