నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం: ఎర్రబెల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అయితే యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆదారపడకుండా స్వయం స్వశక్తితో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇజిఎంఎం..సెర్ఫ్ ఆధ్వర్యంలో బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించాయి. ఇందులో వివిధ రంగాలకు చెందిన సుమారు 80 […] The post నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం: ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అయితే యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆదారపడకుండా స్వయం స్వశక్తితో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థ, ఇజిఎంఎం..సెర్ఫ్ ఆధ్వర్యంలో బుధవారం మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించాయి. ఇందులో వివిధ రంగాలకు చెందిన సుమారు 80 కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళా కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున తరలివచ్చిన నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. చదువు పూర్తి చేసుకుని ఉపాధి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.

యువత తమ ప్రతిభను కనబరుచుకునేందుకు అనేక రంగాలు ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా దృష్టి సారించి తమ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పొందేవిధంగా, నైపుణ్యాలను మరింత పెంపొందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. దీనిని కూడా యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. జియో, రిలయెన్స్, డాక్టర్ రెడ్డీస్, హెటిరో ఫార్మా, క్వారీ వంటి 80కు పైగా కంపెనీలు, 40కుపైగా ఉచిత శిక్షణ కల్పించే ట్రైనింగ్ పార్టనర్ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి.

TS Govt to help unemployees: Minister Errabelli

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నిరుద్యోగ యువతకు అండగా ఉంటాం: ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: