తెలంగాణలో 2 కొత్త రెవెన్యూ డివిజన్లకు నోటిఫికేషన్

TS Logo

రెవెన్యూ డివిజన్‌లుగా కొల్లాపూర్, కోరుట్ల
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన తుది నోటిఫికేషన్ గురువారం ప్రభుత్వం వెలువరించింది. ఈ నేపథ్యంలో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో కొత్తగా కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ రెవెన్యూ డివిజన్‌లో కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, కోడేరు, పెంట్లవెల్లి మండలాలతో కొల్లాపూర్ డివిజన్‌ను ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల జిల్లాలో కొత్తగా కోరుట్ల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. ఈ డివిజన్‌లో కోరుట్ల, మేడిపల్లి, కథలాపూర్ మండలాలు ఉంటాయి.

 TS Govt Notification release for 2 new Revenue Divisions

The post తెలంగాణలో 2 కొత్త రెవెన్యూ డివిజన్లకు నోటిఫికేషన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.