మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు

మనతెలంగాణ/హైదరాబాద్: బాన్స్‌వాడ నియోజకవర్గం పరిధి లోని మంజీరా నదిపై రూ.28,29,00,000 లతో బీర్కూర్ దగ్గర రూ.15,98,00,000 లతో రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా నిజమాబాద్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చెక్ డ్యాంల నిర్మాణంతో మంజీరా నదిలో ఏడాది మొత్తం నీళ్లు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. భూగర్భ […] The post మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మనతెలంగాణ/హైదరాబాద్: బాన్స్‌వాడ నియోజకవర్గం పరిధి లోని మంజీరా నదిపై రూ.28,29,00,000 లతో బీర్కూర్ దగ్గర రూ.15,98,00,000 లతో రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా నిజమాబాద్ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చెక్ డ్యాంల నిర్మాణంతో మంజీరా నదిలో ఏడాది మొత్తం నీళ్లు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. భూగర్భ జలాలపెరుగుతో బోర్లలో కూడా నీళ్లు పుష్కలంగా లభిస్తాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. రాబోయో వర్షాకాలం నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సాగునీటి పారుదలశాఖ డిపిఆర్ రూపొందించిందని ఆయన తెలిపారు. అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కు స్పీకర్ పోచారం ధన్యవాదాలు తెలిపారు.

TS Govt Grant funds for two Check Dams on Manjira River

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: