మరో 100 సంచార పశువైద్యశాలలు

Mobile Veterinary Clinics

 కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదనలు
 ఆర్‌కెవివై కింద 60ః40% నిధులతో మంజూరు చేయాలని విజ్ఞప్తి
 ప్రస్తుతం ఉన్నవాటికి మంచి స్పందన
 సకాలంలో గొర్రెలకు, మేకలకు, ఆవులకు అందుతున్న వైద్యం

మన తెలంగాణ/హైదరాబాద్: పశువులకు అత్యవసర వైద్య సేవలను వాటి దగ్గరికే వెళ్లి అందించేందుకు ప్రభుత్వం కొత్తగా మరో 100 సంచార పశువైద్యశాల వాహనాలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందు కు సంబంధించిన ప్రతిపాదనలను పశుసంవర్థక శాఖ ప్రభుత్వానికి పంపింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌కెవివై కింద 60ః40 వాటా నిధులతో మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 2017 సెప్టెంబర్‌లో నియోజకవర్గానికి ఒక్కటి చొప్పున 100 సంచార పశువైద్య వాహనాలకు సిఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. వీటికి మంచి స్పందన రావడం, అయితే ప్రస్తుతం ఉన్న వాహనాలు ఏకకాలంలో అన్ని చోట్లకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఉన్నవాటికి అదనంగా 100 వాహనాలు అందించాలని నిర్ణయించింది. త్వరలోనే ఈ వాహనాలు అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా ఒక్క నియోజకవర్గంలో రెండు సంచార పశువైద్య వాహనాలు వాటి సేవలను అందించనున్నాయి. వీటి నిర్వహణను పూర్తిగా జివికె సంస్థకు చూస్తోంది. ఇందుకు ఒక్కో వాహనానికి నెలకు కొంత మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం జివికెకు చెల్లిస్తుంది.

తమ పశువులకు ఏదైనా చికిత్స అవసరమైతే 1962 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేస్తే వివరాలు తెలుసుకుని సంచాల వాహనాన్ని పంపిస్తారు. చిన్న ప్రథమ చికిత్స నుంచి పెద్ద సర్జరీల వరకు చేస్తున్నారు. ప్రతి వాహనంలో ఒక పశువైద్యుడు, ఒక కంపౌండర్ ఉంటారు. పశువులకు శస్త్రచికిత్స అవసరమైతే సంబంధిత వైద్య నిపుణలను పంపిస్తారు. ప్రతి వాహనంలో వేల రూపాయాల విలువైన మందులు, శస్త్రచికిత్స పరికరాలు అందుబాటులో ఉంచా రు. విపరీతమైన కాల్స్ పెరగడంతో వాటిని అటెండ్ చేసేందుకు 30 సీటెడ్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అత్యధికంగా గొర్రెలు, మేకలకు చికిత్స అందిస్తున్నారు. ఆవులకు, ఎద్దులకు కూడా అత్యవసర సమయంలో వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ప్రాథమిక పశువైద్య శాలలు అందుబాటులో ఉన్న గ్రామాల నుంచి ఫోన్ కా ల్స్ వస్తే వారిని సంబంధిత పశువైద్యుడి దగ్గరకే పంపిస్తున్నారు.

దూడల్లో నట్టల నివారణ, పాడి పశువులలో గర్భకోశ వ్యాధులకు చికిత్స, వ్యాధి నిరోధక టీకాలు వేయ డం, సకాలంలో అత్యసవర చికిత్సలు చేయడం, గొర్రెలు, మేకలు, పెరటి కోళ్ల అభివృద్ధికి తోడ్పాటునందించడం వంటివి ఈ సంచార పశువైద్యశాల ద్వారా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సేవలు అందిస్తున్న 100 సంచార వాహనాల్లో కొన్నింటిలో పశువైద్యులు లేరు. కేవలం కంపౌండర్‌తోనే ప్రాథమిక చికిత్సలు చేయిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సంచార పశువాహనాల్లో నియమించారు. అయితే వీటిలో చేరేందుకు అర్హులైన అభ్యర్థులెవరూ ఆసక్తి చూపడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినా భర్తీ కాలేదు.

TS Govt Arrange Another 100 Mobile Veterinary Clinics


Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post మరో 100 సంచార పశువైద్యశాలలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.