నేడు ఎంసెట్ తేదీల ప్రకటన

TS EAMCET 2020 exam new schedule today

 

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎంసెట్, ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్‌ను శనివారం వెల్లడించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఉన్నత విద్యామండలి మండలి సెట్స్ తేదీలను ప్రకటించనుంది.

రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్షను జూలై మొదటి వారంలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జూలై 6 లేదా 8 నుంచి ఎంసెట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలోనూ దీనిపై చర్చించి సెట్స్ రివైజ్డ్ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. జూలై 18 నుంచి 23 వరకు మెయిన్ పరీక్షలు ఉండడంతో పాటు రాష్ట్రంలో జూన్ 8 నుంచి జూలై 5వ వరకు పదవ తరగతి పరీక్షల నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే జూలైలో వీలైనంత ముందుగా ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

జూలై 6 నుంచి మొదలుపెడితే 15లోగా పూర్తి చేయవచ్చని, తద్వారా విద్యార్థులు 18వ తేదీ నుంచి జరిగే జేఈఈ మెయిన్‌కు సిద్ధం అయ్యేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ జూలై తొలివారంలో నిర్వహంచకపోతే ఆగస్టుకు వెళ్లే అవకాశం ఉంది. జూలై 23 వరకు జెఇఇ మెయిన్ ఉండగా, అదే నెల 27 నుంచి 31 వరకు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఉంది. పైగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్, తెలంగాణ విద్యార్థులు ఎపి ఎంసెట్ రాస్తారు. మరోవైపు రెండు రాష్ట్రాల విద్యార్థులు జెఇఇ మెయిన్‌కు హాజరవుతారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ విధి విధానాలు, పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణలో తీసుకోనున్న జాగ్రత్తలకు సంబంధించిన ప్రతిపాదనలపై ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వ అనుమతితో శనివారం సెట్స్ రివైజ్డ్ షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు.

TS EAMCET 2020 exam new schedule today

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నేడు ఎంసెట్ తేదీల ప్రకటన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.