102 పదాల ‘ట్రంప్’ ట్వీట్‌తో ప్రపంచ మార్కెట్లు షేక్

వారం రోజుల్లో రూ.94 లక్షల కోట్ల నష్టం అంతర్జాతీయంగా స్టాక్స్ నష్టపోయిన విలువ సింగపూర్: ట్రంప్ ట్విట్టర్‌లో వదిలిన మొత్తం 102 పదాలు ఈవారంలో అంతర్జాతీయంగా స్టాక్స్‌లో దాదాపు 1.36 ట్రిలియన్ డాలర్లు (రూ.94,75,664 కోట్లు) నష్టాన్ని తెచ్చాయి. ట్రంప్ టారిఫ్ ట్విట్ లో ఒక్కో పదం 13 బిలియన్ డాలర్లు (రూ.9,06,63 కోట్ల)ను తుడిచి పెట్టేసింది. చైనా ఉత్పత్తులపై పన్నును పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చేసిన ట్విట్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ […] The post 102 పదాల ‘ట్రంప్’ ట్వీట్‌తో ప్రపంచ మార్కెట్లు షేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వారం రోజుల్లో రూ.94 లక్షల కోట్ల నష్టం
అంతర్జాతీయంగా స్టాక్స్ నష్టపోయిన విలువ

సింగపూర్: ట్రంప్ ట్విట్టర్‌లో వదిలిన మొత్తం 102 పదాలు ఈవారంలో అంతర్జాతీయంగా స్టాక్స్‌లో దాదాపు 1.36 ట్రిలియన్ డాలర్లు (రూ.94,75,664 కోట్లు) నష్టాన్ని తెచ్చాయి. ట్రంప్ టారిఫ్ ట్విట్ లో ఒక్కో పదం 13 బిలియన్ డాలర్లు (రూ.9,06,63 కోట్ల)ను తుడిచి పెట్టేసింది. చైనా ఉత్పత్తులపై పన్నును పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం చేసిన ట్విట్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ వ్యాఖ్యలతో నష్టాలు మూటగట్టుకోవడమే కాదు, మార్కెట్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. జనవరి నుంచి తొలిసారిగా 20 మార్క్‌ను దాటి రెండు రోజుల్లో సిబిఒఇ ఇండెక్స్ 50 శాతం పెరిగింది. అమెరికాచైనా వాణిజ్య సంబంధాలు మరింత క్షీణించగా, మార్కెట్లలో నష్టాల వరద ప్రారంభమైంది.

చైనాకు చెందిన 200 బిలియన్ల దిగుమతి వస్తువులపై పన్నును 10 నుంచి 25 శాతానికి పెంచుతున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ట్విట్టర్‌లో ప్రకటించారు. చైనాతో జరుగుతున్న వాణిజ్య వివాద చర్చల పురోగతి సాధించలేదంటూ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనీస్ దిగుమతులపై పన్నులను పెంచనున్నట్లు ప్రకటించారు. త్వరలో మరో 325 బిలియన్ డాలర్ల దిగుమతులపైనా 25 శాతం అదనపు సుంకాల విధింపును చేపట్టనున్నట్లు తెలియజేశారు. ఫలితంగా చైనాసహా ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి.

మళ్లీ కుప్పకూలిన దేశీయ మార్కెట్లు

అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌వారు మార్కెట్లనూ దెబ్బతీసింది. దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు కుప్పకూలాయి. అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 487 పాయింట్లు పతనమై 37,789 వద్ద స్థిరపడింది. దీంతో 38,000 పాయింట్ల కీలక మార్క్‌ను కోల్పోయింది. ఇక నిఫ్టీ 138 పాయింట్లు కోల్పోయి 11,359 వద్ద ముగిసింది. రెండు పెద్ద దేశాల మధ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు దేశీయంగా ఎన్నికలు, త్వరలో వెలువడనున్న ఫలితాల నేపథ్యంలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుపైనా ఆందోళనలు నెలకొన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఎన్‌ఎస్‌ఇలో అన్నిరంగాలూ బలహీనపడ్డాయి. మీడియా అత్యధికంగా 4.5 శాతం పతనమవగా, రియల్టీ, ఫార్మా, ఆటో, బ్యాంకింగ్ 2- నంచి 1 శాతం మేరకు నష్టపోయాయి. మీడియా కౌంటర్లలో జీ ఎంటర్‌టైన్ 10 శాతం కుప్పకూలింది. సన్ టీవీ, నెట్‌వర్క్ 18, టివి 18, జి మీడియా, పివిఆర్, జాగరణ్ 4.5- నుంచి 1.5 శాతం మధ్య క్షీణించాయి. ఇక రియల్టీ కౌంటర్లలో ఇండియాబుల్స్, ఒబెరాయ్, శోభా, సన్‌టెక్, ఫీనిక్స్ పతనమయ్యాయి. ప్రధాన స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, ఆర్‌ఐఎల్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో నష్టపోగా, మరోవైపు హిందాల్కో, యుపిఎల్, టైటన్, ఏసియన్ పెయింట్స్ లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్, స్మాల్ క్యాప్స్ 1 శాతంపైగా బలహీనపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,808 నష్టపోగా, 150 షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి.

Trump tweets shake stock markets

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 102 పదాల ‘ట్రంప్’ ట్వీట్‌తో ప్రపంచ మార్కెట్లు షేక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: