చైనా గూడ్స్‌పై అమెరికా పన్నులు షురూ

  200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై పన్ను రెట్టింపు మరింత ముదురుతోన్న ట్రేడ్ వార్ న్యూఢిల్లీ : ముందు చెప్పినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది చేశారు. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువచేసే చైనా ఉత్పత్తులపై పన్నును రెట్టింపు చేయాలనే నిర్ణయాన్ని శుక్రవారం అమలు చేశారు. దీంతో ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని చైనా ఆగ్రహం వ్యక్తం […] The post చైనా గూడ్స్‌పై అమెరికా పన్నులు షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై పన్ను రెట్టింపు
మరింత ముదురుతోన్న ట్రేడ్ వార్

న్యూఢిల్లీ : ముందు చెప్పినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నది చేశారు. దాదాపు 200 బిలియన్ డాలర్ల విలువచేసే చైనా ఉత్పత్తులపై పన్నును రెట్టింపు చేయాలనే నిర్ణయాన్ని శుక్రవారం అమలు చేశారు. దీంతో ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీనిపై ప్రతీకారం తీర్చుకుంటామని చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రంప్ అధికార యంత్రాంగం నిర్ణయం నేపథ్యంలో ఇరు దేశాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు వాషింగ్టన్‌లో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇప్పటివరకు అమెరికా 10 శాతం పన్ను విధించేది, అయితే ఇప్పుడు దీనిని 25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

చైనా ఉత్పత్తులపై పెంచిన 25 టారిఫ్ శుక్రవారం నుంచి ఇవి అమల్లోకి వచ్చిందని అమెరికా ప్రకటించింది. అయితే తాజాగా జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలం అయ్యే అవకాశాలు సన్నగిల్లిపోయినట్లేనని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యుఎస్ నిర్ణయం పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చిన చైనా ఇందుకు తగినట్లుగానే తమ ప్రతిస్పందన ఉంటుందని ప్రకటించింది. గురువారం చైనా వైస్ ప్రీమియర్ లియుహి, యూఎస్ ట్రేడ్ సెక్రటరి స్టీవెన్ ముంచిన్ తదితరులు గురువారం దాదాపు 90 నిమిషాల పాటు వాణిజ్యచర్చలు జరిపారు. శుక్రవారం కూడా ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించారు. చర్చలు కొనసాగుతుండగానే అమెరికా టారిఫ్‌ల పెంపును అమలు చేసింది.

ఇప్పటికీ పరిష్కారానికి అవకాశం: ట్రంప్

చైనాతో వాణిజ్య ఒప్పందం పరిష్కారానికి ఇప్పటికీ అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకస్మికంగా పన్నుల పెంపుపై చైనా అధికారులు చర్చలు నిర్వహించడానికి కొద్ది గంటల ముందే ఈ ప్రకటన చేశారు. చైనా ప్రెసిడెంట్ నుంచి అందమైన లేఖను అందుకున్నానని, అయితే చైనాతో విభేదాలు పరిష్కరించుకునేందుకు పన్నులను వినియోగించుకోవడం ఎంతో సంతోషినిస్తోందని అన్నారు. దేశ ప్రజల కోసం తాను టారిఫ్‌లను పెంచానని అన్నారు. చైనాతో చర్చలు ఫలప్రదం అవుతాయని భావిస్తున్నట్లు యూఎస్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. గతంలో చైనా దిగుమతులపై పన్నులు విధించిన సందర్భాల్లో కొంత గడువు ఇచ్చిన అమెరికా ఈసారి ఐదు రోజుల నోటీస్ పిరియడ్‌తో టారిఫ్‌లను పెంచేసింది. దీంతో గురువారం చైనా నుంచి అమెరికాకు బయలుదేరిన ఎగుమతులన్నింటిపై శుక్రవారం పెరిగిన టారిఫ్‌లు వర్తించనున్నాయి. ఇలాంటి చర్యలు చర్చలను దెబ్బతీస్తాయని ఆర్థికవేత్తలు విమర్శించారు.

Trump says tariffs on $200 billion of Chinese goods

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చైనా గూడ్స్‌పై అమెరికా పన్నులు షురూ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: