వలస కూలీలకు తప్పిన పెను ప్రమాదం

Accident

 

నిజామాబాద్: వలస కూలీలతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తాపడిన సంఘటన నిజామాబాద్ జిల్లా మెండోర్ మండలం బుస్సాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజస్థాన్ వలస కూలీలు హైదరాబాద్ నుంచి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో ముగ్గురు ప్రయాణికులు గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మరో బస్సులో కూలీలను రాజస్థాన్ కు తరలించారు.

 

TRSRTC bus roll over in Nizamabad with Migrants

The post వలస కూలీలకు తప్పిన పెను ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.