అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : భూపాల్ రెడ్డి

పెద్దశంకరంపేట (మెదక్) : ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ బలపర్చిన ఆభ్యర్థులదేనని నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి అన్నారు. బుదవారం రాత్రి ఆయన మండల పరిదిలోని కొళ్లపల్లి, బూర్గుపల్లి, మాడ్షెట్‌పల్లి, టెంకటి, బుజ్రాన్‌పల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల ప్రచార సభలలో పాల్గోని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలలోనూ విజయం మనదేనని, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలపర్చిన వారిని అత్యధిక మేజార్టీతో గెలిపించాలన్నారు. […] The post అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : భూపాల్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పెద్దశంకరంపేట (మెదక్) : ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ బలపర్చిన ఆభ్యర్థులదేనని నారాయణఖేడ్ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి అన్నారు. బుదవారం రాత్రి ఆయన మండల పరిదిలోని కొళ్లపల్లి, బూర్గుపల్లి, మాడ్షెట్‌పల్లి, టెంకటి, బుజ్రాన్‌పల్లి తదితర గ్రామాల్లో నిర్వహించిన ప్రాదేశిక ఎన్నికల ప్రచార సభలలో పాల్గోని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలలోనూ విజయం మనదేనని, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీ బలపర్చిన వారిని అత్యధిక మేజార్టీతో గెలిపించాలన్నారు. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లలో మన పార్టీ ఆభ్యర్థులే అదికారంలో ఉంటే అభివృద్ధి పనులు సాఫీగా కొనసాగుతాయన్నారు. కాళేశ్వరం ట్రయిల్ రన్ విజయవంతం కావడంతో ప్రతిపక్ష్ పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పారు. నారాయణఖేడ్ ప్రాంతానికి సైతం కాళేశ్వరం జలాలు వచ్చి ఈ ప్రాంతం కూడా సాగు భూమి విస్తీర్ణం పెరిగి సస్యశ్యామలం అవుతుందని చెప్పారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాజెక్టు విషయంలో చొరవ తీసుకుని కృషి చేస్తున్నారని వచ్చే ఖరీఫ్ నాటికి కొన్ని గ్రామాలకు ఈ నీరు ఆందుతుందని పేర్కొన్నారు. ఇతర పార్టీల వారీకి ఓటేస్తే అది వృధా అవుతుందన్నారు. అధికార పార్టీ బలపర్చిన వారిని గెలిపిస్తేనే ప్రగతి పరుగులు పెడుతుందన్నారు. పెద్దశంకరంపేట మండలంలో సైతం కాళేశ్వరం నుంచి సాగు నీరు వస్తుండడంతో అదనంగా మరో పదిహేను వేల హెక్టార్ల వరకు సాగు లోకి వచ్చే అవకాశాలున్నాయని చెప్పారు. రైతుల కోసం రైతు బంధు పథకం ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ పథకాలనే ఇతర రాష్ట్రాల వారు అమలు చేస్తున్నారని, తెలంగాణకు ఇది ఎంతో గర్వకారణమన్నారు. పెద్దశంకరంపేట మండల జడ్‌పిటిసి ఆభ్యర్థిగా బూత్కూరి విజయరామరాజు, తో పాటు ఆయా గ్రామాల్లో ఎంపిటిసి సభ్యులుగా పార్టీ బలపర్చిన వారినే గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి అభ్యర్థి విజయరామరాజు, పెద్దశంకరంపేట ఎంపిటిసి అభ్యర్థి జంగం శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ సురేష్ గౌడ్, పేట ఎంపిటిసి సభ్యులు విగ్రాం వేణుగోపాల్ గౌడ్, తదితరులు ఉన్నారు.

TRS Victory in all Elections : MLA Bhupal Reddy

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అన్ని ఎన్నికల్లో టిఆర్ఎస్ దే విజయం : భూపాల్ రెడ్డి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.