మూడో విడత పరిషత్ ఎన్నికలపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి

ఆదిలాబాద్ ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్దమవుతున్నారు. మూడో విడతలో ఆరు మండలాల్లోని జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మూడు నియోజవర్గాల పరిధిలోకి ఈ మండలాలు రావడం గమనార్హం. సిరికొండ, ఇచ్చోడ మండలాలు బోథ్ నియోజకవర్గంలోని వస్తుండగా, […] The post మూడో విడత పరిషత్ ఎన్నికలపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ ప్రతినిధి : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు విడతల్లో జరిగిన ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వస్తాయని అధికార టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే మండలాలపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్దమవుతున్నారు. మూడో విడతలో ఆరు మండలాల్లోని జడ్పిటిసి, ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మూడు నియోజవర్గాల పరిధిలోకి ఈ మండలాలు రావడం గమనార్హం. సిరికొండ, ఇచ్చోడ మండలాలు బోథ్ నియోజకవర్గంలోని వస్తుండగా, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాలు ఖానాపూర్ నియోజకవర్గంలోకి, నార్నూర్, గాదిగూడ మండలాలు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వస్తున్నాయి. ఇప్పటికే ఈ మండలాలలో ఎమ్మెల్యేలు పర్యటించారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోనూ ప్రచారాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. రెండు విడతల్లో జరిగిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలలో ఏకపక్ష తీర్పు వస్తుందన్న అంచనాల్లో ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ మూడో విడతలోనూ స్థానాలన్నింటిని కైవసం చేసుకొనే పనిలో పడింది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన తీర్పే పునరావృతం అవుతుందని, జిల్లా పరిషత్ స్థానాలతో పాటు అన్ని ఎంపిపి స్థానాలను గెలుచుకుంటామని జిల్లా ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చెబుతున్నారు. గత ఎన్నికలలో మండలాలు, బూత్‌ల వారీగా పోలైన ఓట్లు, తదితర అంశాలను బేరీజు వేసుకొని మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మండలానికి ఒకటి, రెండు స్థానాలలో మెజార్టీ కొంత తక్కువగా వచ్చినా అన్ని స్థానాలను దక్కించుకుంటామని పేర్కొంటున్నారు. మండలాల వారీగా బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ ఇంటింటి ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇచ్చోడ, సిరికొండ మండలాలలో ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మండలాలు, గ్రామాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఇదిలాఉంటే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిల తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు అధికార టిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారంతో పోటీ పడలేక పోతున్నారు. ఓటమి ఖరారు కావడంతో దిక్కుతోచని పరిస్థితులలో కొట్టుమిట్టాడుతూ మెజార్టీ తగ్గించి పరువు కాపాడుకొనే పనిలో ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్, బిజెపి జిల్లా స్థాయి నాయకులు సైతం ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయడంలో నిరాసక్తత కనబర్చుతున్నారు. రాష్ట్రంలో చేదు ఫలితాలను మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ తరువాత పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరుతుండడంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోంటోంది. మెజార్టీ ప్రజలు అధికార పార్టీకి మద్దతు పలుకుతుండడం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను స్వాగతిస్తుండడంతో అధికార పార్టీని పూర్తి స్థాయిలో ఎదుర్కొనే పరిస్థితులు కనిపించడం లేదని అంటున్నారు.

TRS Special Focus On 3rd Phase Parishad Elections

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడో విడత పరిషత్ ఎన్నికలపై టిఆర్ఎస్ ప్రత్యేక దృష్టి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.