నమ్మకమే

రాష్ట్ర ప్రయోజనాల సాధనపట్ల నిబద్ధతే ప్రజల్లో ఆయనంటే గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచాయి : ఎంపి వినోద్ విశ్వసనీయతకు మారుపేరు కెసిఆర్ మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం మొదలు రాష్ట్ర సాధన వరకు కెసిఆర్ నిబద్ధత, రాష్ట్ర ప్రయోజనాలు, హామీలు, ఆచరణ తదితరాలే ప్రజల్లో పార్టీ పట్ల, వ్యక్తిగా ఆయన పట్ల విశ్వసనీయత ను పెంచాయని, డిమాండ్ మొదలు సాధన వరకు విశ్రమించని పోరాటమే అందుకు గీటురాయి అని కరీంనగర్ […]

రాష్ట్ర ప్రయోజనాల సాధనపట్ల నిబద్ధతే ప్రజల్లో ఆయనంటే గౌరవాన్ని, నమ్మకాన్ని పెంచాయి : ఎంపి వినోద్

విశ్వసనీయతకు మారుపేరు కెసిఆర్

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావం మొదలు రాష్ట్ర సాధన వరకు కెసిఆర్ నిబద్ధత, రాష్ట్ర ప్రయోజనాలు, హామీలు, ఆచరణ తదితరాలే ప్రజల్లో పార్టీ పట్ల, వ్యక్తిగా ఆయన పట్ల విశ్వసనీయత ను పెంచాయని, డిమాండ్ మొదలు సాధన వరకు విశ్రమించని పోరాటమే అందుకు గీటురాయి అని కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల్లో విశ్వసనీయతను సంపాదించడమే నైతి క విజయమని, తెలంగాణ సాకారమయ్యేంత వరకు ఎత్తిన జెండా దించేది లేదని శపథం చేయడం మాత్రమే కాకుండా ఆచరణ కూడా అదే తీరులో ఉండడం కెసిఆర్‌ను ప్రజల నాయకుడిగా తీర్చిదిద్దిందని, రేపటి ఉజ్వల తెలంగాణకు కూడా అదే శ్రీరామరక్షగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధించేంతవరకు మడమ తిప్పేది లేదని, ఉద్యమాన్ని ఆపేదిలేదని ప్రజలకు స్పష్టంగా హామీనిచ్చిన కెసిఆర్ చివరివరకూ అదే కార్యాచరణ కొనసాగించారని, 2014లో తెలంగాణ సాకారమైందని గుర్తుచేశారు. ఒక లక్షం కోసం పట్టు విడవకుండా ఆచరణ కొనసాగించడం ప్రజల ముందు ఉన్న వాస్తవమని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరాల కోసం అభివృద్ధి, సంక్షేమం చేపట్టిన చరిత్ర కూడా కనిపిస్తూనే ఉందన్నారు. ఒక రాజకీయ నాయకుడికి ప్రజల్లో విశ్వసనీయత ఎంత ముఖ్య మో కెసిఆర్ ఆచరణ నుంచి తెలుసుకోవచ్చునని వ్యాఖ్యానించారు.
తెలంగాణ అవసరాలకు మరోమారు
తెలంగాణ రాష్ట్ర సాధనకు అకుంఠిత దీక్షతో ఏ విధంగా కొట్లాడారో గడచిన నాలుగున్నరేళ్ళుగా రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు కోసం వినూత్న పథకాల ను, ప్రాజెక్టులను చేపట్టారని, మరో ఐదేళ్ళపాటు రాష్ట్రానికి ఇదే వేగం అవసరమనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించారని, అదే రేపటి ఎన్నికల్లో ప్రతిఫలిస్తుందని వినోద్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రమే అయినా అభివృద్ధి, సంక్షేమంలో, ఆదాయ వనరులను పెంచుకోవడంలో మరే రాష్ట్రంకంటే ముందువరుసలో ఉందని, పరిశ్రమల స్థాపనలో సరికొత్త విప్లవాన్ని సృష్టించిందని, ఐటి సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో రికార్డులను బద్దలు కొట్టిందని, ఇదే తరహా ప్రగతి భవిష్యత్తులోనూ అవసరమని గుర్తించిన ప్రజలు తప్పకుండా మరోమారు సిఎంగా గెలిపిస్తారని, ఆ ఆవశ్యకతను ప్రజలు గుర్తించడం కెసిఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.
వైఎస్ హయాంలో తెలంగాణను ప్రస్తావించని కాంగ్రెస్ నేతలు
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిన్నారెడ్డి, మధుయాష్కీ లాంటి వేళ్ళమీద లెక్కపెట్టదగిన సంఖ్యలో మాత్రమే కాంగ్రెస్ నేతలు తెలంగాణ డిమాండ్‌ను ప్రస్తావించారని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించారని గుర్తుచేసిన వినోద్‌కుమార్, ఇప్పుడు గొంతు చించుకుంటున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లాంటి నేతలెవ్వరూ ఏనాడూ నోరు తెరవలేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రసమితి ఏర్పడిందే రాష్ట్ర సాధన డిమాండ్‌తో కాబట్టి వైఎస్సార్ హయాం మొదలు కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలో టిఆర్‌ఎస్ శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేవారని, చివరకు పదవులను సైతం వదులుకున్నారని, కేంద్రంలో సైతం కాంగ్రెస్‌పై వత్తిడి తెస్తూనే డిమాండ్ సాధన కోసం కెసిఆర్ మంత్రి పదవిని వదులుకున్నారని, కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించలేదని గుర్తుచేశారు.
ఉమ్మడి రాజధాని ఉన్నంతవరకూ కెసిఆర్ ఉండాలి
హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకూ తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ ఉండాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ నేతలకు అధికారం ఇస్తే మళ్ళీ ఆంధ్ర పెత్తనం మొదలవుతుందనే భయాలు ప్రజల్లో ఉన్నాయని, అందుకే ఇప్పటికే రాష్ట్రమంతటా కెసిఆర్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని వినోద్‌కుమార్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని సాధించేందుకు మొండిగా ఎట్లా కొట్లాడినారో పదేళ్ళ ‘ఉమ్మడి రాజధాని’ బంధం ఉండేంత వరకు తెలంగాణను భద్రంగా కాపాడేందుకు ఆ మొండితనం అవసరమని, అది కెసిఆర్ వల్లనే సాధ్యమవుతుందనేది ప్రజల విశ్వాసమని పేర్కొన్నారు.

Related Stories: