హైదరాబాద్ : టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై ఉభయ సభల ఎంపిలకు కెసిఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశానికి లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. విభజన సమస్యలు, కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిలు లేవనెత్తనున్నారు.
TRS Parliamentary Meeting Held On Tomorrow
Related Images:
[See image gallery at www.manatelangana.news]The post రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.