ఎందుకీ పలాయనం?

ముందస్తు అంటే ఠారెత్తుతున్న విపక్షాలు ఓటమి భయంతోనే వాయిదా కోరుతున్నాయి : బాల్క సుమన్ మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ రద్దయిననాటి నుంచి విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని, కెసిఆర్ రాజకీయ వ్యూహానికి, ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతో వణికిపోతున్నాయని టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల బృందం తొమ్మిది రాజకీయ పార్టీలతో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో రకరకాల కుంటిసాకులు చెబుతూ ఎన్నికలను వాయిదా […]

ముందస్తు అంటే ఠారెత్తుతున్న విపక్షాలు
ఓటమి భయంతోనే వాయిదా కోరుతున్నాయి : బాల్క సుమన్

మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ రద్దయిననాటి నుంచి విపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని, కెసిఆర్ రాజకీయ వ్యూహానికి, ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతో వణికిపోతున్నాయని టిఆర్‌ఎస్ ఎంపి బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల బృందం తొమ్మిది రాజకీయ పార్టీలతో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో రకరకాల కుంటిసాకులు చెబుతూ ఎన్నికలను వాయిదా వేయాలని కోరాయని, ఇందుకు కారణం ఓటమి భయమేనని అన్నారు. ‘మన తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ సాధారణంగా విపక్షాలు ఎన్నికలకు వెళ్ళడానికి ఆసక్తి చూపుతూ అసెంబ్లీ రద్దు కోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటాయని, కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోందని, సిద్ధంగా ఉండాల్సిన ప్రతిపక్షాలకు లాగు తడుస్తోందని అన్నారు. ఎన్నికలను విపక్షాలు అవకాశంగా మల్చుకుంటాయని, కానీ నాలుగున్నరేళ్ళలో ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ చూరగొనడంతో స్థానం కోల్పోయి విపక్షాలు వెనకడుగు వేస్తున్నాయన్నారు. ప్రజల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల నమ్మకం, నాలుగున్నరేళ్ళలో వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధి, తెలంగాణలో అభివృద్ధి కెసిఆర్‌తోనే సాధ్యమన్న విశ్వాసం చూసి విపక్షాలకు దిక్కుతోచడం లేదని చెప్పారు. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కెసిఆర్‌ను, ప్రభుత్వాన్ని ‘దరిద్రం పోయింది’, ‘పీడ విరగడైంది’ అంటూ రకరకాల శాపనార్ధాలు పెట్టిన పార్టీ లు, వాటి నేతలు ఇప్పుడు ఎన్నికలు జరపడానికి కేంద్ర ఎన్నికల సంఘం దాదాపుగా సిద్ధమవుతూ ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోడానికి ఎందుకు వెనకాడుతున్నాయని, రకరకాల కుంటిసాకులు చెప్తూ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని ఎందుకు కోరుకుంటున్నాయని సుమన్ ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో టిఆర్‌ఎస్‌తో తలపడలేమన్న భయంతోనే ఓటర్ల జాబితాలో తప్పులు, సవరణకు సమయం సరిపోదు, ఏడు మండలాలకు లీగల్ చిక్కు లు… ఇలా కుంటిసాకుల్ని చూపుతున్నాయని ఉదహరించారు. తొమ్మిది నెల ల ముందే తెలంగాణకు కెసిఆర్ పాలన నుంచి విముక్తి కలిగిందంటూ వ్యా ఖ్యలు చేసిన నేతలు ఇప్పుడు ఎన్నికలకు ఎందుకు భయపడాల్సి వస్తోందని ప్రశ్నించారు. నిజంగా అసెంబ్లీ రద్దుతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయ ని ఇంతకాలం విమర్శలు చేసిన పార్టీలు ఇప్పుడు ఆ పార్టీతో తలపడడానికి వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్‌ఎస్ విజయం ఏకపక్షమే, వార్ వన్‌సైడే అని విపక్షాలకు అర్థమైనందునే మింగలేక కక్కలేక విలవిల్లాడుతున్నాయని, ప్రజాక్షేత్రంలో కుక్కచావు తప్పదనే భ యంతో తప్పించుకోడానికి ఇప్పుడు కుంటి సాకులు వెతుక్కుంటున్నాయని అన్నారు.

Related Stories: