అసమ్మతి లేదు

టిఆర్‌ఎస్‌లో ఎలాంటి అసమ్మతి లేదు వివిధ సమీకరణాల వల్లనే మాకు పదవులు రాలేదు ఎలాంటి అసంతృప్తి లేదు -మీడియా వార్తలపై టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని ఆ పార్టీ ఎంఎల్‌ఎలు స్పష్టం చేస్తున్నా రు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కొంతమం ది అధికార పార్టీ ఎంఎల్‌ఎలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మీడియాలో, సో షల్ మీ డియాలో వచ్చిన వార్తలను గులాబీ పార్టీ ఎంఎల్‌ఎలు ముక్తకంఠంతో ఖండించారు. మంత్రి […] The post అసమ్మతి లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

టిఆర్‌ఎస్‌లో ఎలాంటి అసమ్మతి లేదు
వివిధ సమీకరణాల వల్లనే మాకు పదవులు రాలేదు
ఎలాంటి అసంతృప్తి లేదు
-మీడియా వార్తలపై టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు

మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్‌ఎస్ పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని ఆ పార్టీ ఎంఎల్‌ఎలు స్పష్టం చేస్తున్నా రు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కొంతమం ది అధికార పార్టీ ఎంఎల్‌ఎలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మీడియాలో, సో షల్ మీ డియాలో వచ్చిన వార్తలను గులాబీ పార్టీ ఎంఎల్‌ఎలు ముక్తకంఠంతో ఖండించారు. మంత్రి పదవులు రానందుకు తమ కు ఎలాంటి అసంతృప్తి లేదని, తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ తమకు నాయకుడని వివిధ సమీకరణాలు, ప్రభు త్వం అవసరాల నేపథ్యంలో మంత్రివర్గా న్ని నిర్ణయించే అధికారం పూర్తిగా ఆయనకే
ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నో అవకాశాలిచ్చారు : రాజయ్య
ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్ తనకు అండగా ఉండడం వల్లే గత ఎన్నిక ల్లో తాను గెలిచానని స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ తనకు ఎన్నో అవకాశాలు కల్పించారని అన్నారు. ఎంతో మంది సీనియర్ నేతలున్నా సిఎం కెసిఆర్‌ను శాసనసభాపక్షనేతగా ప్రతిపాదించే అవకాశం తనకే కల్పించారని తెలిపారు. తనను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా,ప్రభుత్వంలో అనేక రకాలుగా తనను ప్రోత్సహించారని చెప్పారు. సిఎం కెసిఆర్ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. కెసిఆర్ తనను ఉద్యమ నాయకుడిగా తీర్చిదిద్ది, రాజకీయంగా ఎంతగానో ప్రోత్సహించారు స్పష్టం చేశారు. తాను దండోరా ఉద్యమం నుంచి వచ్చానని, సిఎం కెసిఆర్ తనను మాదిగ బిడ్డగా గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారని చెప్పారు. తనకు ఇష్టమైన వైద్యశాఖకు మంత్రిని చేయడం మరిచిపోలేనని పేర్కొన్నారు. తాను నాలుగవసారి గెలవడానికి కెసిఆర్, కెటిఆర్‌లే కారణమని చెప్పారు.

తాను ఇన్ని సార్లు భారీ మెజారిటీలతో గెలవడానికి సిఎం కెసిఆర్ కారణమని అన్నారు. గత ఎన్నికల్లో నా గెలుపులో కెటిఆర్ పాత్ర ఎంతో ఉందని చెప్పారు. కెసిఆర్, కెటిఆర్‌లు తనకు ఏ బాధ్యత అప్పగిజెప్పినా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తనను ఎంఎల్‌ఎగా పూర్తి స్వేఛ్చ ఇచ్చారని,గత సంస్థాగత ఎన్నికల్లో తాను స్వేఛ్చగా జెడ్‌పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను ఎంపిక చేసి, 80 శాతం విజయాలు నమోదు చేసుకున్నామని చెప్పారు. ఇదంతా సిఎం కెసిఆర్ చలవనే అని, ఆయనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని పేర్కొన్నారు. సిఎం కెసిఆర్‌పై మాదిగ జాతి ఆశాభావంతో ఉందని, తమ జాతికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తారని తెలిపారు. అందరకీ ఒకేసారి అవకాశాలు కల్పించలేరని అన్నారు. తన హోదా తగ్గట్లు తగిన పదవి ఇస్తామని సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు భరోసా ఇచ్చారని వెల్లడించారు. మాదిగలకు మంద కృష్ణ ఒక్కడే ప్రతినిధి కాదని, తాను అంతకన్నా పెద్దవాడినే అని వ్యాఖ్యానించారు. తాను సిఎం కెసిఆర్‌కు, మంత్రి కెటిఆర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తాను మాట్లాడినట్లు ఆడియో, వీడియోలు ఎక్కడా లేవని అన్నారు. మీడియా అంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. తాను అనని మాటలు అన్నట్లు మీడియాలో రావడం బాధ కలిగించిందని చెప్పారు. అందరికీ న్యాయం చేయాలని సిఎం కెసిఆర్ భావిస్తున్నారని అన్నారు.

TRS MLAs Respond On Disagreement  In TRS Party

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post అసమ్మతి లేదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.