నేటి నుండి టిఆర్‌ఎస్ సభ్యత్వం ప్రారంభం…

  జులై 20కి సభ్యత్వం ముగింపు నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వం టార్గెట్ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎంఎల్‌ఎలు వరంగల్ : టిఆర్‌ఎస్ పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎలకు ప్రారంభించగా శనివారం నుండి నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎలు మండలాల వారిగా సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 మంది ఎంఎల్‌ఎలు ఒక పార్టీ నియోజకవర్గ […] The post నేటి నుండి టిఆర్‌ఎస్ సభ్యత్వం ప్రారంభం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జులై 20కి సభ్యత్వం ముగింపు
నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వం టార్గెట్
సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ఎంఎల్‌ఎలు

వరంగల్ : టిఆర్‌ఎస్ పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరిచేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎలకు ప్రారంభించగా శనివారం నుండి నియోజకవర్గాల్లో ఎంఎల్‌ఎలు మండలాల వారిగా సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11 మంది ఎంఎల్‌ఎలు ఒక పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఈ కార్యక్రమానికి శనివారం శ్రీకారం చుట్టనున్నారు.

నియోజకవర్గానికి ఆరు మండలాలు నియోజకవర్గ కేంద్రమైన మున్సిపాలిటీల్లో ఈ సభ్యత్వ కార్యక్రమం నమోదు ప్రారంభం కానుంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి అన్ని నియోజకవర్గాల ఎంఎల్‌ఎలు పార్టీ ముఖ్యులతో సభ్యత్వ నమోదుపై చర్చించారు. మండలానికి పదివేల సభ్యత్వానికి తక్కువ కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలని సూచనలు చేశారు. క్రియాశీల సభ్యత్వానికి రూ.100, సాధారణ సభ్యత్వానికి రూ.50ల చొప్పున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలన్నారు. రానున్నది మున్సిపాలిటీ ఎన్నికలు కావడంతో మున్సిపాలిటీ కేంద్రాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం తీవ్రంగా ఉండాలని ఎంఎల్‌ఎలు సూచించారు.

ఇదిలా ఉంటే టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల్లో తీవ్రమైన స్పందన కనబడుతుంది. పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రజలు కూడా భారీ ఎత్తున సభ్యత్వ నమోదుకు ముందుకు వస్తున్నారు. సభ్యత్వం ప్రతి సభ్యునికి రూ.5 లక్షల ప్రమాద బీమా ఉండడం వల్ల సభ్యత్వ నమోదుకు డిమాండ్ పెరుగుతున్నది. గతంలో జరిగిన సభ్యత్వ నమోదులో సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు, నాయకులకు ప్రమాదంలో మరణిస్తే రూ.2 లక్షలు పార్టీ ఆధ్వర్యంలో ఇన్సురెన్స్ కంపెనీల ద్వారా నిధిని ఇప్పించారు. దాన్ని స్పూర్తిగా తీసుకున్న ప్రజలు ఎక్కువ శాతం సభ్యత్వ నమోదు వైపు మొగ్గు చూపుతున్నారు.

సభ్యత్వంతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికలు

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో శనివారం నుండి ప్రారంభిస్తుండగా జులై 20 వరకు ఈ కార్యక్రమం ముగిస్తున్నారు. ఇదే సమయంలో సభ్యత్వ కార్యక్రమంతో పాటు వార్డు, గ్రామ కమిటీలను కూడా పూర్తి చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ను ఎంఎల్‌ఎలు స్థానిక నేతలకు సూచించారు. దాని ప్రకారంగా ఒక పక్క సభ్యత్వ నమోదు చేస్తూనే మరోపక్క వార్డు, గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. జులై 20 వరకే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నందున ప్రత్యేక ఇన్‌చార్జ్‌లను కూడా నియమిస్తున్నారు.

TRS Membership Begins

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నేటి నుండి టిఆర్‌ఎస్ సభ్యత్వం ప్రారంభం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: