ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు

ఆదిలాబాద్ : రెండో సారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వరుస ఎన్నికలు రావడంతో మిన్నకుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఆవిర్బావ సభ కంటే ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ముఖ్య నేతలు భావిస్తూ వచ్చినప్పటికీ వరుస ఎన్నికలు రావడంతో భర్తీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎంపిటిసి, జడ్ పిటిసి, మున్సిపల్ ఎన్నికలు వరుసగా […] The post ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : రెండో సారి అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలు నామినేటెడ్ పదవులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే వరుస ఎన్నికలు రావడంతో మిన్నకుండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఆవిర్బావ సభ కంటే ముందే నామినేటెడ్ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ముఖ్య నేతలు భావిస్తూ వచ్చినప్పటికీ వరుస ఎన్నికలు రావడంతో భర్తీ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఎంపిటిసి, జడ్ పిటిసి, మున్సిపల్ ఎన్నికలు వరుసగా ఉండడంతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే నామినేటెడ్ పదవులను భర్తీ చేయడం జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఎన్నికలన్ని పూర్తయ్యే అవకాశం ఉండడంతో ఆ తరువాత దశల వారీగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపడతారని అంటున్నారు. ఇదిలాఉంటే గతంలో ఎలాంటి నామినేటెడ్ పదవి రాని వారికి ప్రాధాన్యత ఇస్తారని, అసెంబ్లీ నుంచి మున్సిపల్ వరకు జరుగుతున్న ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం పాటు పడిన వారికే నామినేటెడ్ పదవులను కట్టబెడతారని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్ల పదవులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇప్పటికే ఉన్న కార్పొరేషన్ల పాలక మండలిలను రద్దు చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లలో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వందకు పైగా డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు అంతర్గతంగా కసరత్తు జరుగుతోందని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ పదవులు భర్తీ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలో పలువురు సీనియర్ నాయకులకు డైరెక్టర్ల పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వీటితో పాటు పలు మార్కెట్ కమిటీల చైర్మన్ల పదవీ కాలం ముగిసినప్పటికీ నూతన చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న మార్కెట్ కమిటీలతో పాటు జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టుల పదవీ కాలం సైతం దగ్గర పడుతుండడంతో పార్టీలోని ముఖ్య నాయకులు వీటిపై ఆశతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తమవంతు కృషి చేస్తున్నారు. రిజర్వేషన్లు అనుకూలించక ఎన్నికలలో పోటీ చేయలేని వారు నామినేటెడ్ పదవి వరిస్తుందని ఆశతో ఉండగా, వారికి ఎమ్మెల్యేలు సైతం పదవులను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇక ఎలాంటి పదవిని పొందని వారు ఈ సారి ఎలాగైనా తమను ఏదో ఒక పదవి వరిస్తుందని ధీమాతో ముందుకెళ్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన నాయకులకే కాకుండా ప్రత్యేకంగా కొందరికి ఈ పదవులు దక్కే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని నియోజక వర్గాల్లో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న నాయకులకు కొందరు ఎమ్మెల్యేలు ప్రాధాన్యతనివ్వడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు ఎమ్మెల్యేల వద్ద ప్రాధాన్యత దక్కడంతో పార్టీలోని సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి నేతల పేర్లను కూడా ఎమ్మెల్యేలు ఈ పదవుల కోసం ప్రతిపాదించలేదనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న వారిని జిల్లాల వారీగా గుర్తించి నామినేటెడ్ పదవులను కేటాయించాలని సిఎం కెసిఆర్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మొత్తమ్మీద ఈ పదవుల భర్తీలో పాత, కొత్త నేతలకు సమన్యాయం జరిగేలా అధినేత ప్రత్యేక దృష్టి సారించారనే ప్రచారం సాగుతోంది. కాగా జిల్లా స్థాయిలోని కీలకమైన కొన్ని నామినేటేడ్ పదవులు కూడా భర్తీకి నోచుకోలేదు. ఇలాంటి పరిస్థితులలో మిగిలిన నామినేటెడ్ పోస్టులను పార్టీ కోసం పాటు పడే వారికి అందించి అసంతృప్తిని తొలగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో పోటీ చేసేందుకు అధికార టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో వారిని బుజ్జగించేందుకు ఏదో ఒక నామినేటెడ్ పదవులను ఇస్తామని హామీ ఇస్తూ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని సూచిస్తున్నారు. నామినేటెడ్ పదవుల ఆశతో ఉన్న వారు ఎన్నికలలో పోటీ చేయకుండా బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడుతున్నారు. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన వారితో పాటు టికెట్లు ఇవ్వని వారికి సముచిత స్థానం కల్పిస్తున్న సిఎం కెసిఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ ఇదే పాలసీని అమలు చేస్తారని టిఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.

TRS Leaders Focus on Nominated Posts

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఊరిస్తున్న నామినేటెడ్ పదవులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: