గులాబీ శ్రేణుల విస్తృత ప్రచారం

ఆదిలాబాద్ : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే బేల, జైనథ్, ఆదిలాబాద్, మావల, తాంసి, భీంపూర్ మండలాల నాయకులు, గ్రామస్థాయి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపడుతున్నారు. జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు సైతం ఉదయం, సాయంత్ర వేళల్లో ఓటర్లను కలుస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. […] The post గులాబీ శ్రేణుల విస్తృత ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఆదిలాబాద్ : ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే బేల, జైనథ్, ఆదిలాబాద్, మావల, తాంసి, భీంపూర్ మండలాల నాయకులు, గ్రామస్థాయి నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపడుతున్నారు. జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులు సైతం ఉదయం, సాయంత్ర వేళల్లో ఓటర్లను కలుస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత దృష్టా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పగటి వేళల్లో ప్రచారంలో పాల్గొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న సైతం అస్వస్థతకు గురయ్యారు. ఇదిలాఉంటే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలలో భారీ విజయాలను నమోదు చేసుకున్న టిఆర్‌ఎస్ పార్టీ అదే ఊపుతో ప్రచారాన్ని చేపడుతూ ముందుకు సాగుతోంది. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రావుత్ మనోహర్ బేల మండలంలోని వివిధ గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ టిఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇక మండలాల వారీగా బృందాలుగా ఏర్పడుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో పర్యటిస్తూ ఓటర్లకు నమూనా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేస్తూ ఓట్లను అభ్యర్థిస్తూ బిజీగా గడుపుతున్నారు. సాయంత్రం ప్రచారం ముగిసిన అనంతరం మరుసటి రోజు పర్యటించే గ్రామాల షెడ్యూల్‌ను రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. ఇదిలాఉంటే ఎమ్మెల్యేలు సైతం ప్రచారపర్వంలో పాల్గొంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాలన్నింటికి కైవసం చేసుకోవాలని సూచిస్తూ ఉత్సాహాన్ని నింపుతున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే మండలాలలో ప్రచారం జోరుగా కొనసాగిస్తుండగా, రెండు, మూడో విడతలో ఎన్నికలు జరిగే మండలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన తరువాత ప్రత్యర్థులు ఎవరనేది తేలనుండగా, ఇప్పటికే టిఆర్‌ఎస్ అభ్యర్థులు గ్రామాల పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి ఓటరును కలిసి ఓట్లను అభ్యర్థించాలనే ఏకైక లక్ష్యంతో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని చేపడుతుండగా, జడ్పిటిసి అభ్యర్థులు మాత్రం మండలంలోని అన్ని గ్రామాలలో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు. గతానికంటే భిన్నంగా ప్రచారాన్ని చేపడుతూ ప్రతి ఓటరును కలిసి ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మెజార్టీ గ్రామాల సర్పంచులు టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే కావడం, ఎంపిటిసి సైతం టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉంటే గ్రామాభివృద్దికి ప్రత్యేక నిధులు వచ్చే అవకాశం ఉండడంతో వారు పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

TRS leaders Election Campaign in Adilabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post గులాబీ శ్రేణుల విస్తృత ప్రచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: