ఎంఎల్‌సిగా గుత్తా ఎన్నిక

Guttaహైదరాబాద్‌ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, టిఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంఎల్ఎ కోటా ఎంఎల్‌సి  ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఈ క్రమంలో గుత్తా ఎంఎల్‌సిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తెలిపారు. ఎంఎల్‌సిగా ఎన్నికైన గుత్తాకు ఆయన ధ్రువపత్రం అందించారు. ఎంఎల్‌సిగా ఎన్నికైన గుత్తాను తెలంగాణ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ లు అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

TRS Leader Gutta Sukender Reddy Elect As MLC

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఎంఎల్‌సిగా గుత్తా ఎన్నిక appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.