టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తుంది

  చేవెళ్లరూరల్ : టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని స్వగ్రామం కౌకుంట్లలోని స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధిపై స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతోకలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం విద్యాభివ్పద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. కేజీటూపీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు […] The post టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చేవెళ్లరూరల్ : టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం చేవెళ్ల మండల పరిధిలోని స్వగ్రామం కౌకుంట్లలోని స్వర్గీయ ఇంద్రారెడ్డి సమాధిపై స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతోకలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం విద్యాభివ్పద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. కేజీటూపీజీ ఉచిత విద్యలో భాగంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలో విద్య బోధన అందిస్తున్నారన్నారు.

విద్యార్థులకు మౌలిక వసతులు, నాణ్యమైన విద్య బోధిస్తున్నారన్నారు. ఉత్తీర్ణత, హాజరు శాతం పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ క్యాబినేట్‌లో మంత్రి పదవి దక్కడం చాలా సంతోషకరమన్నారు. సిఎం నమ్మకాన్ని నిలబెట్టి రాష్ట్రాభివ్పద్ధ్దితో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపడం హర్షనీయమన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును 3ఏళ్లలోనే పూర్తి చేశారని చెప్పారు. ఈ ప్రాంతానికి పాలమూర్ నుంచి నీళ్లు తీసుకువస్తానన్నారు.

ఈకార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షులు మలిపెద్ది వెంకటేషంగుప్త, పార్టీ సీనియర్ నాయకులుగోపాల్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, వెంకటస్వామి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు వనం లక్ష్మికాంత్‌రెడ్డి, యువనాయకులు గుడుపల్లి రవికాంత్‌రెడ్డి, గుడుపల్లి శ్రీకాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎండీ జహంగీర్, గుడెం సురేందర్, చేవెళ్ల ఉపసర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు మాసన్నగారి మాణిక్యరెడ్డి, బురాన్ విఠలయ్య, పడాల ప్రభాకర్, ప్రకాశ్‌గౌడ్, నాగార్జున్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అంజయ్య, యాదిరెడ్డి, ఎన్ను జంగారెడ్డి, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

TRS government provides quality Education to Students

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తుంది appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: