గెలుపు తథ్యం : బి. బి. పాటిల్

పెద్దశంకరంపేట (మెదక్): పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖరారైందని, పార్టీ శ్రేణులు మెజార్టీ పైనే దృష్టి సారించాలని జహిరాబాద్ పార్లమెంట్ టిఆర్‌ఎస్ ఆభ్యర్థి బి.బి.పాటిల్ అన్నారు. బుదవారం రాత్రి స్థానిక గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇక పై దేశానికే దిక్సూచిగా మారనుందని అన్నారు. తెలంగాణలోని […]

పెద్దశంకరంపేట (మెదక్): పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖరారైందని, పార్టీ శ్రేణులు మెజార్టీ పైనే దృష్టి సారించాలని జహిరాబాద్ పార్లమెంట్ టిఆర్‌ఎస్ ఆభ్యర్థి బి.బి.పాటిల్ అన్నారు. బుదవారం రాత్రి స్థానిక గాంధీ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇక పై దేశానికే దిక్సూచిగా మారనుందని అన్నారు. తెలంగాణలోని పథకాలు ఇతర రాష్ట్రాలు కాపీ కోడుతున్నాయని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలనను ముఖ్యమంత్రి కెసిఆర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సహకరించకపోయినా తన వంతుగా జహిరాబాద్ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశానని ఆయన చెప్పారు. సంగారెడ్డి – నాందేడ్ జాతీయ రహదారి విస్తరణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే నారాయణఖేడ్ నియోజకవర్గంలో మరో జాతీయ రహాదారి నిజాంపేట, బీదర్ విస్తరణ పనులు కూడా త్వరలోనే అరంభం కానున్నాయని ఆయన వివరించారు. తెలంగాణలోని మొత్తం 16 సీట్లు మనం గెలుచుకుంటే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చన్నారు. ఈ వచ్చే ఐదేళ్లలో కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించే దిశగా టిఆర్‌ఎస్ ఎంపిలందరూ కలిసి కట్టుగా కృషి చేయనున్నారని చెప్పారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తో కలిసి అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. టిఆర్‌ఎస్ అంటేనే అభివృద్ది కి మరో నిర్వచనమన్నారు. ఇంటింటికి తాగు నీరు అందించే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బంధు పథకం ప్రవేశ పెట్టి అన్నదాతలకు ఆండగా నిలుస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో తన నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపడతున్నామని చెప్పారు. రెండు జాతీయ రహాదారులు, బీదర్ -బోదన్ రైల్వే పనులు కూడా తన హయాంలోనే మంజురయ్యాయని పాటిల్ గుర్తు చేశారు. కెసిఆర్ ప్రభుత్వం అంటేనే అభివృద్ది కి మారుపేరన్నారు. తాగునీటి సౌకర్యం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. సింగూర్ నుంచి పెద్దశంకరంపేట కు తాగునీరు అందించనున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సహాయంతో జహిరాబాద్ పాస్ పోర్టు కార్యాలయంతో పాటు కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంగారెడ్డి-నాందేడ్ జాతీయ రహాదారి నెంబరు 161 ని నాలుగు వరుసల రహాదారిగా మార్పు చేసే పనులు కూడా తన హాయాంలో చేపట్టినవేనని ఆయన వివరించారు. ఈ ఎన్నికల తరువాత తమ టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపిల మద్దతుతోనే కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ కే ఓటు వేసి గెలిపించాలన్నారు. అలాగే వచ్చే నెల 3 వ తేదిన అల్లాదుర్గం మండలం ఐబి చౌరస్తా వద్ద నిర్వహించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ప్రచార సభలో పాల్గోన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…తనకు గత శాసనసభ ఎన్నికలలో ఈ ప్రాంత అఖండ మెజార్టీ ఇచ్చారని, ఈ ఎన్నికల్లో సైతం తనకంటే ఎక్కువ మెజార్టి ఇవ్వాలన్నారు. శాసనసభ ఎన్నికల తరువాత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సైతం టిఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి, అన్ని పార్టీలను మట్టి కరిపించారన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడే ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయని చెప్పారు. టిడిపిని తెలంగాణ నుంచి గెంటి వేశారని, నారాయణఖేడ్‌లోని టిడిపి నాయకుడు కూడా పేరుకే టిడిపిలో ఉన్నా అది చెల్లని రూపాయి కిందే లెక్కన్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు గతంలో కాంట్రాక్టర్ పని చేసినా, ఎంపి అయిన తరువాత తన పనులన్నీ వదులుకుని ప్రజల కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో ఉన్న అభ్యర్థి మదన్‌మోహన్ కేవలం ఎన్నికల సమయంలోనే ఎదో ఒక పార్టీ జెండా పట్టుకుని కనిపిస్తారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదన్నారు. మెదక్ నుంచి ఇందిరాగాంధీని గెలిపించినా ఇక్కడ చేసింది శూన్యమన్నారు. ప్రధాన మంత్రి గా పనిచేసిన ఇందిరాగాంధీ మెదక్ లో చేపట్టిన పనులేమిటో స్పష్టం చేయాలని ఆయన కాంగ్రెస్ నేతలను డిమాండ్ చేశారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ నేతలు కనిపిస్తారని ఆయన ఎద్దెవా చేశారు. ఇంకా ఈ కార్యక్రమములో పెద్దశంకరంపేట ఎంపిపి బాసాడ రాజు, మండల టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్యక్షులు విజయరామరాజు, మండల రైతు సమన్వయ సమితి ఆధ్యక్షులు సురేష్ గౌడ్, మైనార్టీ నాయకులు మొహిజ్ ఖాన్, కేంద్ర పుడ్ కార్పోరేషన్ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి సభ్యులు వేణుగోపాల్ గౌడ్, మాణిక్ రెడ్డి, మండల సర్పం చ్‌ల ఫోరం అధ్యక్షులు కుంట్ల రాములు, మాజీ ఉప సర్పంచ్ మురళి పంతులు నాయకులు అమర్, శంకరయ్య, అడివయ్య, బక్కారెడ్డి, రమేష్, మల్లేశం, పెరుమాండ్లు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

TRS Candidate BB Patil Election Campaign in Medak

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: