స్థానిక కౌన్సిల్ స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు

  రంగారెడ్డి జిల్లా : పట్నం మహేందర్‌రెడ్డి వరంగల్ : పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నల్లగొండ : తేరా చిన్నపురెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, జి ల్లాల స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడానికి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డిలను అభ్యర్థులుగా కెసిఆర్ ఖరారు చేశారు. […] The post స్థానిక కౌన్సిల్ స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగారెడ్డి జిల్లా : పట్నం మహేందర్‌రెడ్డి

వరంగల్ : పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ : తేరా చిన్నపురెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, జి ల్లాల స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడానికి టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల పేర్లను ఆదివారం సాయంత్రం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డిలను అభ్యర్థులుగా కెసిఆర్ ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ ముగ్గురిని పార్టీ అధ్యక్షుడు ఓకే చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నామినేషన్ల తుది గడువు 14వ తేదీ కావడంతో కెసిఆర్ అభ్యర్థుల ఎంపికపై సీనియర్ నాయకులతో పాటు మంత్రులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయా జిల్లాల మంత్రులతో సిఎం చర్చించిన అనంతరమే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిసింది.

సిఎం కెసిఆర్‌తో ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్‌రెడ్డి, మహమూద్‌అలీలు కెసిఆర్‌తో సమావేశమయ్యారు. పలువురు మంత్రులతో సిఎం కెసిఆర్ భేటీ అనంతరమే అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు జరిపినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ముగ్గురు అభ్యర్థులకు భి ఫారాలను అందచేసినట్టు తెలిసింది. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టిఆర్‌ఎస్ సంపూర్ణ మెజార్టీ వస్తుందని, అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని, అవసరమైతే క్యాంపులను ఏర్పాటు చేసుకొని అభ్యర్థులు గెలిపించుకుంటామని మంత్రులు టిఆర్‌ఎస్ అధ్యక్షుడితో పేర్కొన్నట్టు తెలిసింది.

అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలి
ఎంపిటిసి, జెడ్పీటిసి ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని సిఎం కెసిఆర్ మంత్రులు, పార్టీ వర్గాలతో ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లో వస్తాయని, ఆ విధంగానే స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులే గెలవాలని ఆ దిశగా సీనియర్ నాయకులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని కెసిఆర్ సూచించినట్టు సమాచారం. ఇప్పటికే ఈ ముగ్గురు అభ్యర్థులపై ఎమ్మెల్యేలు, జెడ్పీటిసిలు, ఎంపిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సానుకూలంగా ఉన్నారని పార్టీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. గత ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని కెసిఆర్‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు పేర్కొన్నట్టు తెలిసింది. భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపించాలని, మూడు జిల్లాల నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సమావేశాలను నిర్వహించి సమన్వయం చేసుకోవాలని ప్రతి ఒక్క ఓటు మనకు ముఖ్యమని కెసిఆర్ వారికి సూచించినట్టు సమాచారం.

ఉప ఎన్నికలు జరపాలని ఇసి నిర్ణయం..
అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ నుంచి టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి, మునుగోడులో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు టిఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా మురళీ (వరంగల్) ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని ఈసీ నిర్ణయించింది. ఉప ఎన్నికల్లో గెలిచిన గెలిచిన వారి పదవీకాలం 2022 జనవరి 4వరకు ఉంటుంది.

TRS announces candidates for Local council positions

Related Images:

[See image gallery at manatelangana.news]

The post స్థానిక కౌన్సిల్ స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: