విజయం మనదే : వినోద్ కుమార్

వేములవాడ : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కరీంనగర్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు నివాసంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. కార్యకర్తల కృషి  వల్లే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు. గతంలో 10ఓట్లు కూడా రాని పార్టీకి నలుగురు మాట్లాడుకునే […] The post విజయం మనదే : వినోద్ కుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వేములవాడ : కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని, తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కరీంనగర్ టిఆర్ఎస్ ఎంపి అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు నివాసంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వినోద్ కుమార్ మాట్లాడారు. కార్యకర్తల కృషి  వల్లే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు. గతంలో 10ఓట్లు కూడా రాని పార్టీకి నలుగురు మాట్లాడుకునే సరికి ఓట్లు వచ్చాయని భ్రమ పడుతున్నారే తప్ప, అందులో నిజం లేదని విమర్శించారు. ఎక్కడో 5,6 స్థానాలలో మాత్రమే ఆ పార్టీ రెండో స్థానంలో ఉంటుందే తప్ప పెద్దగా ప్రభావం చూపబోదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అస్త్ర సన్యాసం చేసినట్లేనని వినోద్ కుమార్ ఎద్దేవా చేసారు. గడిచిన ఎన్నికల్లో బిజెపితో అనైతిక వ్యవహారమే ఇందుకు నిదర్శనమన్నారు. గ్రామీణ పాంతాల్లో టిఆర్‌ఎస్ పార్టీ బలంగా ఉండడం వల్లే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, అయినప్పటికి ముఖ్యమంత్రి కేసిఆర్ నినాదం 16 రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌కు లాభం, బిజెపి గెలిస్తే మోడీకి మాత్రమే లాభమని, రాష్ట్రంలో టిఆర్ఎస్ గెలిస్తే రాష్ట్ర ప్రజలకు లాభం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తొందరలోనే రాబోతున్నాయని, గ్రామాల వారిగా, మండలాల వారీగా నాయకులు సమైఖ్యంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా నూతనంగా ఏర్పడిన జిల్లాలో గ్రామం నుంచి మండలం, మండలం నుంచి జిల్లా వరకు, జిల్లా నుంచి రాష్ట్రం వరకు పార్టీ అభ్యర్థులే ఉండడం వల్ల మరింత అభివృద్ది జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే రమేష్ చెన్నమనేని మాట్లాడుతూ… నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ పార్టీ ఓటర్లు చెక్కు చెదరకుండా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరించాలన్నారు. రాత్రికి రాత్రి బిజెపితో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుందని, ఆ పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెప్పబోతున్నారన్నారు. వారి రాజకీయ అనైతిక చర్యను తప్పనిసరిగా ఎండకడుతాన్నారు. స్థానిక సంస్థల్లో కూడా గెలుపు మనదేకావాలన్నారు. పార్టీ క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ… భావోద్వేగాలను రెచ్చగొడుతూ ఓట్లు దండుకునే పార్టీ బిజెపి అని విమర్శించారు. గడిచిన ఎన్నికల్లో వారు పన్నిన కుట్రకు వారే బలికావాల్సి వస్తుందన్నారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరిపాలనకే పాఠాలు నేర్పిన సిఎం కెసిఆర్ నేతృత్వంలో పార్లమెంట్ అభ్యర్థుల గెలుపు ఖాయమన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా పార్టీ ఇంచార్జీ బస్వరాజు సారయ్య, టిఆర్‌ఎస్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, ఎర్రం మహేష్, మున్సిపల్ అధ్యక్షురాలు నామాల ఉమ, ఎంపిపిలు సంకినేని లక్ష్మి, తిప్పని శ్రీనివాస్, జెడ్పిటిసిలు అంబటి గంగాధర్, పల్లం అన్నపూర్ణ, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు ఊరడి ప్రవీణ్, గడ్డం హన్మండ్లు, న్యాలకొండ రాఘవరెడ్డి, మరాఠి మల్లిక్, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, గంగాధర్ గౌడ్, సెస్ డైరెక్టర్‌లు రామతీర్థపు రాజు, జడల శ్రీనివాస్, దేవరకొండ తిరుపతి, కౌన్సిలర్లు ముద్రకోళ వెంకటేషం, నిమ్మశెట్టి విజయ్, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు నామాల లక్ష్మిరాజం, ముప్పిడి శ్రీనివాస్, పొలాస నరేందర్, నరాల శేఖర్, గూడురి మధు, పీర్ మహ్మద్, చేపూరి గంగాధర్, పాత రమేష్, బండ నర్సయ్య యాదవ్, అంజద్ పాషా, సోమినేని బాలు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, పెంట బాబు, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

TRS Activists Meeting in Vemulawada

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విజయం మనదే : వినోద్ కుమార్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: