హిందూ మహాసముద్రంలో ఉష్ణ మండల తుపానులు!

  హిందూ మహాసముద్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వార్తల్లోకి వస్తోంది. మార్చి నెలలో ఇదాయి తుపాను పతాక శీర్షికల్లో నిలిచింది. మొజాంబిక్ దేశంపై దాడి చేసిన అత్యంత తీవ్రమైన తుపాను ఇదాయి. వెయ్యి మంది పైగా ప్రజలు మరణించారు. ఆఫ్రికా ఖండం ఉత్తరార్థంపై దాడి చేసిన తుపానుల్లో అత్యంత తీవ్రమైన తుపాను ఇదాయి. అంతకు ముందు మొజాంబిక్ ను తాకిన అతి భయంకరమైన తుపాను 2000 సంవత్సరంలో వచ్చిన ఎలీన్. కాని ఎలీన్ కూడా ఇప్పుడు మార్చిలో […] The post హిందూ మహాసముద్రంలో ఉష్ణ మండల తుపానులు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హిందూ మహాసముద్రం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు వార్తల్లోకి వస్తోంది. మార్చి నెలలో ఇదాయి తుపాను పతాక శీర్షికల్లో నిలిచింది. మొజాంబిక్ దేశంపై దాడి చేసిన అత్యంత తీవ్రమైన తుపాను ఇదాయి. వెయ్యి మంది పైగా ప్రజలు మరణించారు. ఆఫ్రికా ఖండం ఉత్తరార్థంపై దాడి చేసిన తుపానుల్లో అత్యంత తీవ్రమైన తుపాను ఇదాయి. అంతకు ముందు మొజాంబిక్ ను తాకిన అతి భయంకరమైన తుపాను 2000 సంవత్సరంలో వచ్చిన ఎలీన్. కాని ఎలీన్ కూడా ఇప్పుడు మార్చిలో వచ్చిన ఇదాయి అంత బలమైన తుపాను కాదు. ఇదాయి తర్వాత ఆరు వారాలకు అంతకన్నా భయంకరమైన తుపాను మొజాంబిక్, టాంజానియా సరిహద్దుల్లో బీభత్సం సృష్టించింది. కెన్నెత్ కేటగిరి 4 ట్రాపికల్ తుపాను.

ఇది అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. మొజాంబిక్‌ను తాకిన తుపానుల్లో ఇది ప్రత్యేకమైనది. టాంజానియాను తాకిన మొదటి ట్రాపికల్ తుపాను ఇది. మొజాంబిక్ ప్రాంతంలో సాధారణంగా తుపానులు జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో వస్తుంటాయి. కాని కెన్నెత్ తుపాను ఈ సీజను గడిచిన తర్వాత వచ్చింది. ఈ సీజనులో రెండు భయంకరమైన తుపానులు రావడం కూడా మొదటిసారి. ఇలా ఒకే సీజనులో రెండు తుపానులు ఈ ప్రాంతంలో ఇంతకు ముందు లేవు.

హిందూ మహాసముద్రంలో మూడవ అతిభయంకరమైన తుపాను ఫణి. ఇది కేటగిరీ 5కు స్థాయి ట్రాపికల్ తుపాను. భారతదేశం తూర్పు తీరాన్ని భయంకరంగా తాకింది. హిందూ మహాసముద్రంలో కేటగిరి 5 ట్రాపికల్ తుపానులు రికార్డయ్యింది 1989లో మొదటిసారి. ఈ సముద్రంలో ట్రాపికల్ తుపానులు రావడం చాలా తక్కువ. ఈ తీవ్రమైన తుపానులు హిందూ మహాసముద్రం ఉపరితలంపై ఏర్పడడానికి కారణం సముద్ర జలాల ఉష్టోగ్రత 30 డిగ్రీల సెంటీగ్రేడు అంతకన్నా ఎక్కువకు చేరుకోవడమే. గ్లోబల్ వార్మింగ్ ఫలితమిది. సముద్ర జలాలు వేడెక్కితే తీవ్రమైన తుపానులు ఏర్పడతాయి. ఎల్ నినో వంటివి కూడా తుపానులకు కారణమవుతాయి. ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా ఒక కారణం. వీటి వల్ల సముద్రంలో భౌగోళికంగా చిన్న ప్రాంతంలో ఉష్టోగ్రత పెరుగుతుంది. దాని వల్ల వేడి గాలులు బలంగా వీచడం ప్రారంభమవుతుంది.

అమెరికా తీరప్రాంతాల్లో తీవ్రమైన తుపాను మామూలే. కాని హిందూ మహాసముద్రంలో ఈ తీవ్రమైన తుపానులు రావడం అనేది గతంలో లేదు. ఇప్పుడు ఎక్కువయ్యాయంటే వాతావరణ మార్పులపై జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. అమెరికాలాంటి దేశంలో తీవ్రమైన తుపానులు వచ్చినా ప్రజలను ఆదుకునే యంత్రాంగం, తుపానులను ఎదుర్కొనే సాంకేతికత అందుబాటులో ఉన్నాయి. కాని హిందూ మహాసముద్రంలో ఇలాంటి తుపానులు వస్తే అవి దాడి చేసే దేశాలు మూడో ప్రపంచ దేశాలు.

ట్రాపికల్ తుపానులను సాఫ్పిర్ సింప్సన్ స్కేలుపై కొలిచి గాలి వేగం ఆధారంగా కేటగిరి నిర్ణయిస్తారు. ట్రాపికల్ తుపానులు ఏడు వాతావరణ కారణాల వల్ల ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనది సముద్ర ఉపరిత జలాల ఉష్ణోగ్రత పెరగడం. వాతావరణంలో తేమ శాతం పెరగడం, వాతావరణం అస్థిరంగా ఉండడం తదితర కారణాల వల్ల తుపానులు ఏర్పడతాయి. తుఫాను సముద్ర ఉపరితలంపై ఉన్నప్పుడే అది మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతాయి. కనీసం 26.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత సముద్ర ఉపరితల జలాల్లో ఉంటే ట్రాపికల్ తుపాను ఏర్పడుతుంది. ఈ ఉష్ణోగ్రత మరింత పెరిగి 28 నుంచి 29 డిగ్రీల సెల్పియస్‌కు చేరుకుంటే అత్యంత తీవ్రమైన తుపానులు ఏర్పడుతాయి. ఈ కారణం వల్లనే ఆఫ్రికా దక్షిణ తీరంలో తీవ్రమైన తుపానులు వస్తున్నాయి.

హిందూ మహాసముద్ర దక్షిణ తీరం చాలా వేగంగా వేడెక్కుతోంది. ఇంతకు ముందు ట్రాపికల్ తుపానులు ఏర్పరచిన, 26.5 డిగ్రీల సెల్సియస్ వేడి కలిగిన ప్రాంతాలు ఇప్పుడు 30 నుంచి 32 డిగ్రీల సెల్పియస్ ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నాయి. అలాగే భూమధ్యరేఖకు దూరంగా ఉన్న ప్రాంతాలు, ట్రాపికల్ తుపాను ఏర్పడే స్థాయి సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు లేని ప్రాంతాలు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్న ప్రాంతాలు కూడా ఇప్పుడు 26 డిగ్రీల సెల్సియస్ స్థాయికి చేరుకున్నాయి. దానివల్ల ట్రాపికల్ తుపానులు పెరుగుతున్నా యి. 2017లో దక్షిణాఫ్రికా, మొజాంబిక్ తదితర దేశాలపై తుఫాను దాడి చేసింది. దక్షిణ మొజాంబిక్ తీరాన్ని తాకి బలహీనపడింది.

సముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతతో పాటు ఈ తుపానులకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అందులో ఎల్ నినో, ఇండియన్ ఓషన్ డైపోల్ వంటి అనేక వాతావరణ మార్పులు, విపరీత వాతావరణ పరిస్థితులు కూడా కారణం. తుపానులను ప్రస్తుతం సాఫిర్ సింప్సన్ పద్ధతి ప్రకారం తీవ్రత లెక్కిస్తున్నారు. కాని ఒక తుపాను వల్ల ఎంత వర్షపాతం కురిసింది, తుపాను గాలుల ఎత్తు ఎంత, ఎంతకాలం వర్షం కురిసింది, తుపాను తీరాన్ని తాకినప్పుడు ఎలా తీరంపైకి వచ్చింది ఇలాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశోధనలు చేయవలసి ఉంది. ఇలాంటి తుపాను వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. ఇదాయి తుపాను మొజాంబిక్ ను తాకినప్పుడు భయంకరమైన వరదలు రావడానికి కారణమిదే. కొన్ని ప్రాంతాల భౌగోళిక పరిస్థితి తుపానును తట్టుకునేలా ఉండదు. వరదలు ముంచెత్తితే ప్రజలను హెచ్చరించి, తరలించే సదుపాయాలు కొన్ని ప్రాంతాల్లో ఉండవు. తీరం తాకినప్పుడు ఆ ప్రాంతంలో ఎంత జనాభా ఉంటుందన్నది కూడా చాలా ముఖ్యం. జనాభా సాంద్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారిని ఖాళీ చేయించడం, పునరావాస చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి కష్టమవుతుంది.

ఏది ఏమైనా ఈ సంవత్స రం హిందూ మహాసముద్రంలో గతంలో ఎన్నడూ లేనన్ని తుపా ను వచ్చాయి. సౌత్ ఇండియన్ ఓషన్ అనేది భూమధ్యరేఖకు దక్షిణాన ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా పశ్చిమ తీరం వరకు విస్తరించిన ప్రాంతం. జులై నుంచి ఈ సంవత్సరం ప్రారం భమైన తుపాన్ల సీజనులో మొత్తం 17 తుపానులు వచ్చాయి. 1980లో ఇక్కడ 22 తుపానులు వచ్చిన రికార్డు ఉంది. కాని ఈ సంవత్సరం వచ్చిన తుఫానులు చాలా ఉధృతమైనవి. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పులు అనేక బీభత్సాలకు కారణ మవుతున్నాయి. మొన్న ఏప్రిల్ నెలలో హఠాత్తుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ , గుజరాత్‌‌, రాజస్థాన్ల్‌లో 41వేల పిడుగులు పడ్డాయి. వందల మంది ప్రాణాలు తీశాయి. ఈ అకాల ప్రళయం ఇండియాపై విరుచుకుపడ్డానికి కారణం… వెస్టర్న్ డిస్టర్బెన్స్(డబ్ల్యు. డి). అంటే పశ్చిమం నుంచి వీచే చల్లటి గాలులు. వాయువ్య భారతంలోని వేడి గాలులతో కలిసి స్థానికం గా ప్రళయాన్ని సృష్టించాయి. ఇప్పుడు ఫణి తుఫాను ధాటికి ఒడిశా ఎండుటాకులా వణికింది. వాతావరణ మార్పులు ఎలాంటి బీభత్సాన్ని సృష్టిస్తాయో ఈ ట్రాపికల్ తుపానులే ఉదాహరణ. అయినా వాతావరణ మార్పులపై అమెరికావంటి దేశాలు నిర్లక్ష్యవైఖరి ప్రదర్శించడమే కాదు, పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం శోచనీయం.

                                                                                                             – జెన్నిఫర్ ఫిషెట్ ( స్క్రోల్ )
Tropical cyclones in the Indian Ocean

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హిందూ మహాసముద్రంలో ఉష్ణ మండల తుపానులు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: