మాటల మాంత్రికుడు రాజీపడ్డాడా..?

హైదరాబాద్: మాటలతో సినీ అభిమానులను సమ్మోహితులను చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన ఏ హీరోతో సినిమా చేసిన ఆ ప్రాజెక్ట్ పై ఆటోమెటిక్ గా భారీ అంచనాలు నెలకొంటాయి. త్రివిక్రమ్ సినిమా అంటే మినీమం గ్యారెంటీ ఉంటుంది. కానీ, ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి ఆయన్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక తాజాగా విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌కి లక్షల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి కానీ […]

హైదరాబాద్: మాటలతో సినీ అభిమానులను సమ్మోహితులను చేసే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఆయన ఏ హీరోతో సినిమా చేసిన ఆ ప్రాజెక్ట్ పై ఆటోమెటిక్ గా భారీ అంచనాలు నెలకొంటాయి. త్రివిక్రమ్ సినిమా అంటే మినీమం గ్యారెంటీ ఉంటుంది. కానీ, ఇటీవల విడుదలైన అజ్ఞాతవాసి ఆయన్ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇక తాజాగా విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ టీజర్‌కి లక్షల కొద్దీ వ్యూస్‌ వస్తున్నాయి కానీ టీజర్‌లోని కంటెంట్‌పై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టైటిల్‌ విషయంలో తన ముద్ర చాటుకున్న త్రివిక్రమ్‌ టీజర్‌లో మాత్రం అతడి శైలికి భిన్నంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఓవర్సీస్‌ బిజినెస్‌ పూర్తి కావడంతోనే ఇలాంటి టీజర్‌ కట్‌ చేసారనే కామెంట్ చేస్తున్నారు. ఇక్కడి డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆకట్టుకోవడానికి ఇలా యాక్షన్‌ టీజర్‌ కట్‌ చేసి ఉంటారని, ఓవర్సీస్‌ బిజినెస్‌ కాకపోయినట్టయితే ఇలాంటిది వదిలే వారు కాదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో ప్రీమియర్స్‌కి మంచి వసూళ్లు రావాలంటే టీజర్‌, ట్రైలర్ ఎంతో కీలకం. కానీ, ‘అరవింద సమేత’ టీజర్‌ అక్కడి ఆడియన్స్ కి కంగారు పుట్టించేలా ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు.

తారక్ తో ఫ్యామిలీ డ్రామా తీస్తానని చెప్పిన త్రివిక్రమ్‌ ఇలా మాస్ మసాల టీజర్‌ ఎందుకు వదిలినట్టు? అజ్ఞాతవాసి తర్వాత పూర్తిగా డీలా పడ్డా ఆయన తన సామర్ధ్యంపై నమ్మకం కోల్పోయాడా? మంచి ఓపెనింగ్స్‌ కోసం తారక్ పై ఆధార పడిపోయాడా? లేక మాస్‌ని ఆకట్టుకునే క్రమంలో ఈ విధంగా చేసి ఉంటాడా? కారణాలు ఏమైనా కానీ మాటల మాంత్రికుడు బాగా రాజీ పడిపోయాడనే పుకార్లు తెలుగు సినీ జనాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. మొదట సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకుని, ఆ తర్వాత థమన్ కు స్వరాలు అందించే బాధ్యతను అప్పగించడం, కథలో కూడా మార్పులు చేయడం వరకు ఇలా అన్నిట్లోనూ త్రివిక్రమ్‌ రాజీ పడడంతో ఈ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దాడనేది చూడాలి. మరోవైపు ‘అరవింద సమేత’కు లీకుల బెడద వెంటాడుతుంది. దీంతో ఈ మూవీపై తారక్ అభిమానుల్లో కొంత భయం నెలకొంది. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే మూవీ థియేటర్లకు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Comments

comments

Related Stories: