మా మధ్య రహస్యాలుండవు!

ఎప్పటికీ తరిగిపోని అందం త్రిషది. మొదటి సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. వయసు అస్సలు పెరగదేమో అనిపిస్తుంది. తమిళ నటే అయినా తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో త్రిష తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 2004లో ‘వర్షం’, 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’, ‘అతడు’, ‘ఆరు’, 2006లో ‘స్టాలిన్’, 2007లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరు లే’, 2008లో ‘కృష్ణ’.. ఇలా వరుస సినిమాలతో హిట్లు కొట్టింది. […] The post మా మధ్య రహస్యాలుండవు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఎప్పటికీ తరిగిపోని అందం త్రిషది. మొదటి సినిమాలో ఎలా కనిపించిందో ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది. వయసు అస్సలు పెరగదేమో అనిపిస్తుంది. తమిళ నటే అయినా తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో త్రిష తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత 2004లో ‘వర్షం’, 2005లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’, ‘అతడు’, ‘ఆరు’, 2006లో ‘స్టాలిన్’, 2007లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరు లే’, 2008లో ‘కృష్ణ’.. ఇలా వరుస సినిమాలతో హిట్లు కొట్టింది. దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసన మెరిసిన త్రిష తెలుగు, తమిళంలోనే కాకుండా పలు హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లోనూ సందడి చేసింది. ఈ నెలలోనే 36వ పుట్టినరోజును జరుపుకుంది.

త్రిష పుట్టిన ఊరు: 1983లో చెన్నైలో…

చదువు: చెన్నైలో సేక్రేడ్ హార్ట్ స్కూల్, ఇతిరాజ్ మహిళా కళాశాలలో బీబీఏ పూర్తి చేశారు.
అవార్డులు: 1999లో ‘మిస్ సేలం’ కిరీటం సొంతం చేసుకున్నారు. అదే ఏడాది మిస్ మద్రాస్ కిరీటం కూడా గెలుచుకుంది. 2001లో మిస్ ఇండియా పోటీల్లో ‘బ్యూటిఫుల్ స్మయిల్’ అవార్డు సొంతం చేసుకున్నారు.

మాట్లాడే భాషలు: మతృభాష తమిళమే అయినా హిందీ, ఫ్రెంచ్, ఇంగ్లిషు బాగా మాట్లాడుతుంది.
కెరీర్ మొదలు: పాపులర్ వీడియో ‘మేరీ చునార్ ఉడ్ ఉడ్ జాయే’ తో నటిగా కెరీర్ ప్రారంభించింది.

నటించిన హీరోలు: టాలీవుడ్, కోలీవుడ్‌లో అందరు అగ్ర కథానాయకులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేశ్‌బాబు, వెంకటేశ్, ప్రభాస్, రజనీకాంత్, కమల్ హాసన్,విజయ్, అజిత్, విజయ్ సేతుపతి తదితరులతో నటించింది.
* 2015 జవనరిలో త్రిషకు వరుణ్ అనే బిజినెస్‌మెన్‌తో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి త ర్వాత నటనను కొనసాగించకూడదని వరుణ్ చెప్పడంతో ఆమెనిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.
* స్కూటీ పెప్, ఫాంటా, వివెల్, కోల్‌గేట్ తదితర ఉత్పత్తుల సంస్థలకు త్రిష ప్రచార కర్తగా వ్యవహరించింది.
* త్రిషకు తన తల్లి ఉమా కృష్ణ న్ అంటే చాలా ఇష్టం. ఇద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవంటోంది. ఆమె షూ టింగ్‌లకు కూడా ఉమ వెళ్తుంటారు. త్రిష చిన్న వయసులో నే తండ్రి మరణించాడు.
* అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఖట్టా మీటా’ అనే చిత్రంతో త్రిష బాలీవుడ్‌కు పరిచయం అయింది.
* త్రిషకు శునకాలంటే కూ డా చాలా ఇష్టం. ‘పెటా’ గు డ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేసింది.
* యూనిసెఫ్ సెలబ్రిటీ అ డ్వొకేట్‌గానూ, తమిళనా డు, కేరళ రాష్ట్రాల్లో బాల్య వివాహం, బాల కార్మికు లు, వేధింపుల అంశాల కు వ్యతిరేకంగా పనిచేస్తోంది.

Trisha Krishnan Profile

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మా మధ్య రహస్యాలుండవు! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.