సైబరాబాద్‌లో జోరుగా ట్రిపుల్ రైడింగ్

  ఆరు నెలల్లో 35,763 కేసులు నమోదు నెలకు 5,960 కేసులు బుక్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు రూ.4,19,62,800 జరిమానా విధించిన పోలీసులు ఫోన్‌లో మాట్లాడుతున్న కేసులు 6,600 కౌన్సెలింగ్ ఇస్తున్నామారని వాహనదారులు హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు చెబుతున్నా వాహనదారులు వినడంలేదు. పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నా రు, రోడ్డుప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మిగతా వాహనదారులు రోడ్డు […] The post సైబరాబాద్‌లో జోరుగా ట్రిపుల్ రైడింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆరు నెలల్లో 35,763 కేసులు నమోదు
నెలకు 5,960 కేసులు బుక్ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు
రూ.4,19,62,800 జరిమానా విధించిన పోలీసులు
ఫోన్‌లో మాట్లాడుతున్న కేసులు 6,600
కౌన్సెలింగ్ ఇస్తున్నామారని వాహనదారులు

హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు చెబుతున్నా వాహనదారులు వినడంలేదు. పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నా రు, రోడ్డుప్రమాదాల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, మిగతా వాహనదారులు రోడ్డు ప్రమాదా ల బారిన పడుతున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఏడాది కేడాది రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, దీంతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయని చెబుతున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా మంది ఉద్యోగులు పనిచేస్తుండడంతో మోటార్‌సైకిళ్లపై ప్రతి రోజూ వస్తుంటారు.

ఈ క్రమ ంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులతో ట్రా ఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయాల్లో మో టార్ సైకిల్‌పై ముగ్గురు చొప్పున వెళ్తుండడంతో చాలామంది ఇబ్బందులు పడడమే కాకుండా, రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ ఆరు నెలల్లో సైబరాబా ద్ పరిధిలో పలువురు మోటార్ వాహనదారులు ట్రా ఫిక్ నిబంధనలను పాటించకుండా ముగ్గురు కలిసి ఒ కే బైక్‌పై వెళ్లడంతో ఇప్పటి వరకు 35,763 కేసులు న మోదు చేశారు. నిబంధనలు పాటించని వారిపై 4, 19,62,800 రూపాయల జరిమానా విధించారు. ట్రి పుల్ రైడింగ్ వల్ల వారికి ఇతర వాహనదారులకు కూ డా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రిపుల్ రైడింగ్ చేస్తున్న వారు రోజుకు 5,960మందిపై కేసులు నమోదు చేసి, జరిమానా విధిస్తున్నారు. పలుసార్లు వారిని అదుపులోకి తీసుకుని ట్రిపుల్ రైడింగ్ వల్ల జరిగే అనార్ధాలను వివరిస్తున్నారు. వారి బైక్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇ స్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ చట్టరీత్యా నేరమని, పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మోటార్ సైకిల్ నడుపుతున్న వారు 281మంది మరణించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే వీరు మృతిచెందినట్లు తెలిసింది. ఇప్పటి వరకు ట్రిపుల్ రైడింగ్ వారికి జరిమానా రూ.100 విధిస్తుండగా, కేంద్రం దీనిని రూ .2,000కు పెంచింది. త్వరలోనే ఈ జరిమానా అమలులోకి రానుంది. ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్శ మోటార్ సైకిల్‌పై ముగ్గురితో కలిసి ప్రయాణించడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారు ఎంతటి వారైనా జరిమానా విధిస్తున్నారు.

సెల్ ఫోన్ డ్రైవింగ్….
ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడుపుతున్న వా రిపై కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ఆరు నెలల్లో ఫోన్‌లో మా ట్లాడుతూ వాహనాలు నడిపిన వారిపై 6,600 కేసులు నమోదు చేశారు. వారిపై రూ.59,23,000 జరిమానా విధించారు. సెల్ ఫోన్‌లో మాట్లడుతూ వాహనాలు నడుపవద్దని, దీని వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నా వినడంలేదు.

చాలా మంది ఒక చేతితో ఫోన్ మాట్లాడుతూ ఒక చేతితోనే డ్రైవింగ్ చేస్తుండడంతో వామనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో చాలా మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. వారు కా కుండా రోడ్డు వెంట నడిచివెళ్తున్న వారి ఊపిరి తీస్తున్నారు. వీరి వల్ల అమాయకులు తమ విలువైన ప్రాణాల ను కోల్పోతున్నారు. మోటార్‌సైకిల్ వారు, కార్లు న డుపుతున్న వారు కూడా ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు :ట్రాఫిక్ డిసిపి, సైబరాబాద్, విజయ్‌కుమార్
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని చెబుతున్నాం, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి విజయ్‌కుమార్ హెచ్చరించారు. ట్రిఫుల్ రైడింగ్, ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల చాలా మంది రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. సైబరాబాద్‌లో 5లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారు, వారు ప్రతి రోజుల వచ్చిపోతుండడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, ఈ సమయంలో ట్రిపుల్ రైడింగ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల మిగతా వారికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

Triple Riding in Cyberabad

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post సైబరాబాద్‌లో జోరుగా ట్రిపుల్ రైడింగ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: